వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఫె పాస్ వర్డ్ మార్చిందని ఆమెను ఏం చేశాడంటే..!

వైఫే పాస్ వర్డ్ మార్చిందని ఓ మహిళపై కక్షకట్టిన యువకుడు ఆమె పోన్ నెంబర్ ఫేస్ బుక్ లో నకిలీ పేజీ క్రియేట్ చేశాడు. దీంతో ఆమెకు ప్రతిరోజూ వందలాది అసభ్యకరమైన ఫోన్లు వస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :వైఫె పాస్ వర్డ్ మార్చివేశారనే నెపంతో ఓ ప్రబుదుడ్డు ఫేస్ బుక్ లో అమ్మాయి గురించి తప్పుడు సమాచారాన్ని పోస్టుచేశాడు. దీంతో ఆమెకు ప్రతిరోజూ ఫోన్లలో వేధింపులు ఎక్కువయ్యాయి.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా రాకొండకు చెందిన తుమ్మెట్టి ఆశోక్ ఎఎస్ రావు నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం తన నివాసాన్ని ఎల్ బి నగర్ కు మార్చాడు. తల్లిదండ్రులు కూడ హైద్రాబాద్ కు రావడంతో ఆయన ఎల్ బి నగర్ లోనే తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అయితే ఎల్ బి నగర్ లో ఆశోక్ నివాసం ఉండే పక్కనే ఇంట్లోనే వైఫె వినియోగించేవారు. ఈ వైఫె సదుపాయాన్ని ఆశోక్ వాడుకొనేవాడు. ఇది గమనించిన వైఫె యజమాని ఆశోక్ ను మందలించింది. వైఫె పాస్ వర్డ్ ను మార్చివేసింది.

wifi password

వైఫై పాస్ వర్డ్ మార్చడంతో ఆశోక్ కు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమెకు తగిన బుద్ది చెప్పాలని భావించాడు. ఆమె సెల్ ఫోన్ నెంబర్ తో నకిలీ ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేశాడు. అందులో అసభ్యకర పోస్టులను పోస్ట్ చేశాడు.

ఈ నెంబర్ కు ప్రతిరోజూ ఫోన్లు చేస్తూ వేధించడం ప్రారంభించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు విచారణ జరిపితే నిందితుడు ఆశోక్ గా తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

English summary
boy arrest harresemting on lady in hyderabad , after changing wifi password boy harrassed lady with abusing messages on face book, police arrested accused on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X