వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 వేళ్ళతో పుట్టిన శిశువు... వింతగా చూస్తున్న జనాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో వింత శిశువు జన్మించాడు . జోగులాంబ గద్వాల జిల్లాలో జన్మించిన ఈ శిశువును జనాలు వింతగా చూస్తున్నారు . కొన్ని సందర్భాల్లో చాలా మందికి అసాధారణ శిశువులు జన్మిస్తారు . అయితే అలా జన్మించిన వారికి కాస్తో కూస్తో ఇబ్బంది ఉంటుంది. కానీ అలాంటి ఏ ఇబ్బంది లేకుండా సాధారణ శిశువు లాగే ఉన్నాడు ఓ శిశువు .

మనిషికి చేతులకు..కాళ్లకు కలిపి ఎన్ని వేళ్లుంటాయి అంటే 20 అని ఠక్కున చెప్పేస్తాం. కాని కొంతమందికి ఒక్కో చేతికి ఆరు వేళ్లు ఉండటం చూస్తుంటాం. అలాంటి శిశువులు ఎక్కువగానే జన్మిస్తుంటారు. చేతికి 6 వేళ్ళు ఉన్న శిశువులు సహజంగా అదనంగా ఉండే వేలు అతుక్కుని పుడుతారు. కానీ అలా కాకుండా 24 వేళ్ళతో జన్మించాడు ఓ వింత శిశువు. సాధారణంగా ఉండే 20 వేళ్ళతో పాటు మరో నాలుగు వేళ్ళు బోనస్ గా పుట్టాడు గద్వాల జిల్లాలో ఓ శిశువు.

Boy born with 24 fingers and toes..People looking him strangely

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జన్మించిన ఈ శిశువు 24 వేళ్లతో పుట్టింది. ఆ శిశువు కాళ్లు, చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉన్నాయి. గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన సరోజ దంపతులకు పుట్టిన ఈ మగబిడ్డ 24 వేళ్లతో జన్మించగా.. రెండు చేతులకు.. రెండు కాళ్లకు ఆరేసి వేళ్లు ఉండటం విశేషం.ఏకంగా నాలుగు వేళ్ళు అదనంగా అది కూడా మిగతా వేళ్ళ లాగా సహజంగా ఉండడం చాలా అరుదుగా జరిగే సంఘటన అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ చిన్నారిని చూడడానికి స్థానికులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఒక వింతగా అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో ఇది స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.

మిగతా 5 వేళ్ళలాగా సహజ స్థితిలో అదనంగా మరో వేలు ఉండటం నిజంగా ఆ శిశువుకు బాగా ఉపయోగపడుతుందేమో అన్న భావన కలుగుతుంది ..ఆ శిశువు మిగతా వారి కంటే ఎక్కువ తన చేతులతో పని చెయ్యగలడు . ఉదాహరణకు అతను ఏ సంగీత పరికరం నేర్చుకున్నా , లేదా కంప్యూటర్ లో టైపు చేసినా మన కంటే ఎక్కువ సమర్ధంగా 6 వేళ్ళను ఉపయోగించగలడు కదా .

English summary
A baby boy has been born in Jogulamba Gadwal district with 24 perfectly formed fingers and toes - six on each hand and foot.Being born with additional digits - or being a "polydactyl" - is not wholly uncommon, but it is unusual to see the condition on every extremity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X