వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి దశదిన కర్మలో హెల్మెట్లు పంచిపెట్టిన బాలుడు.. నా పరిస్థితి ఎవ్వరికీ రావద్దు(వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ ఈ స్లోగన్ మనందరికీ తెలుసు. అతివేగం ప్రాణం తీస్తుందనే స్లోగన్స్ వాహనాల మీద కనిపిస్తుంటాయి. రవాణాశాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తారు. కానీ కొందరు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ కొనసాగిస్తారు. మరోవైపు ఇతరులు చేసే డ్రైవింగ్ మరికొందరి ప్రాణాల మీదికి తెస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఓ వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఓ బాలుడి తన తండ్రిని కోల్పోతాడు. ఖర్మ రోజు భోజనంతోపాటు హెల్మెట్ పంచి మిగతావారికి జీవితం అంటే ఏంటో తెలియజేశాడు.

గిఫ్ట్‌గా హెల్మెట్

గిఫ్ట్‌గా హెల్మెట్

ఎక్కడ జరిగిందో తెలియదు కానీ .. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఓ పదేళ్ల బాలుడు తన తండ్రిని రోడ్డు ప్రమాదంలో కోల్పోతాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోతుంది. ఇంటికి ప్రధాన ఆదాయ వనరేగాక .. పెద్ద లేకపోవడంతో వారు తల్లడిల్లిపోయారు. దశదినకర్మ రానే వచ్చింది. అయితే వారు అందిరీలా చేయకూడదని నిర్ణయించుకున్నారు. భోజనంతోపాటు వచ్చిన ప్రతి ఒక్కరికీ హెల్మెట్ అందజేయాలని భావించారు. ఆ మేరకు అతిథులకు హెల్మెట్ అందజేశారు. వారికి స్వయంగా తండ్రిని కోల్పోయిన బాలుడే హెల్మెట్ అందజేయడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఆ బాధ మీకొద్దు ..

కుటుంబ పెద్దను మేం కోల్పోయాం.. మీరు మాలా కాకుడదని కోరుకుంటున్నారు. కర్మకు వచ్చిన అతిథులకు మంచి భోజనం పెట్టారు. తర్వాత ఒక్కొక్కరికి హెల్మెట్ అందజేశారు. వచ్చిన వారు కూడా హెల్మెట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటామని సైగ చేశారు. అతిథులుగా వచ్చినందుకు గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారని కొందరు పేర్కొన్నారు. దీంతో తాము తమతోపాటు కుటుంబాన్ని గుర్తుంచుకొని వాహనాలను నడుపుతామని అంటున్నారు. ఏదైనా పని ఉంటే కాస్త ముందు బయల్దేరుతామని చెప్తున్నారు. జీవితం అంటే ఒక్కరు కాదని .. కుటుంబం అని గుర్తుచేస్తున్నారు. ఇవాళ్టి కర్మరోజున బాలుడు తమకు జీవితం విలువను హెల్మెట్ అందజేసి కల్పించారని ప్రశంసించారు.

ఆలోజింపజేసింది ..

ఆలోజింపజేసింది ..

ప్రతీ రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట చనిపోతూనే ఉన్నారు. దీంతో వారి కోసం గంపెడశాలతో ఎదురుచూస్తున్న కుటుంబం .. ప్రమాద వార్త విని గుండె పగిలిపోతోంది. వారు కన్న కలలు ప్రమాద రూపంలో కబలించిపోతున్నాయి. ఒక కుటుంబం అనుభవించిన బాధను మిగతావారికి తెలియజేసేందుకు హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయం. సమాజంలో ప్రతీ ఒక్క కుటుంబ పెద్ద కూడా అవగాహన, అప్రమత్తతో ఉంటే కాస్తైనా ప్రమాదాలను నివారొంచచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బాలుడు హెల్మెట్లు అందజేసిన వైనాన్ని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఆ కుటుంబం చేసిన మంచి పని నాలుగుకాలాల పాటు గుర్తుండిపోతుందని చెప్తున్నారు.

English summary
A boy loses his father in a road accident. They are the main source of income for the home .. Then came the stage. But they decided not to do like that. The helmet was supposed to be provided to everyone who came along for lunch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X