వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. లిప్ట్‌లో బాలుడు, గోడబద్దలు కొట్టిన సిబ్బంది ...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గంట కాదు రెండు గంటలు కాదు .. ఏకంగా నాలుగు గంటలు. సరిగా గాలి రాని పరిస్థితి. ఒక్కరే .. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అదేం గదిలోనే, హాలీడే స్పాట్ కాదు. లిప్ట్ .. ఔను లిప్ట్‌లో అది కూడా మూడేళ్ల బాలుడు నాలుగుగంటల నరకయాతన అనుభవించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే సాంకేతికంగా లిప్ట్ బాగుచేయడం కుదరకపోవడంతో గోడను బద్దలుకొట్టారు. ఇందుకోసం 4 గంటల సమయం పట్టింది. అయితే బయట ఉన్న పేరెంట్స్ బాలుడికి ధైర్యం చెప్పి .. లిఫ్ట్‌లో ఉన్న క్షేమంగా తీయడం సులువైందని పోలీసులు తెలిపారు.\

పనిచేయని లిప్ట్ ..

పనిచేయని లిప్ట్ ..

అపార్ట్‌మెంట్లలో లిప్ట్‌లు తప్పనిసరి. కానీ కొన్ని చోట్ల మరమ్మతులు సరిగా చేయకపోవడంతో లిప్ట్‌లు సక్రమంగా పనిచేయవు. అదేవిధంగా హైదరాబాద్‌లోని చందానగర్ పాపిరెడ్డి కాలనీలో కూడా ఓ లిప్ట్ పనిచేయలేదు. దీంతో అందులో ఉన్న బాలుడు నరకయాతన అనుభవించాడు. అరుపులు .. కేకలతో సాయం చేసేందుకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు కూడా గుమిగూడారు. సహాయక చర్యలు చేపట్టారు.

పైకెళ్లి ఆగింది ..

పైకెళ్లి ఆగింది ..

రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో ఫనీంద్ర ప్యామిలీ ఉంటుంది. వారికి సౌర్యన్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే సౌర్యన్ ఆడుకుంటూ లిప్ట్ ఎక్కాడు. పైవరకు వెళ్లిన లిప్ట్ సాంకేతిక కారణంతో ఆగిపోయింది. ఇంకేముంది ఆ బాబు ఆర్తనాదాలు మారుమోగిపోయాయి. వెంటనే లిప్ట్ వద్దకు చేరుకొన్న పేరెంట్స్ .. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అయితే లిప్ట్ బాగుచేయడం ఆలస్యమవడంతో .. గోడను బద్దలు కొట్టారు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు లిప్ట్‌లోనే ఉండిపోయాడు సౌర్యన్.

తీస్తున్నాం .. బేటా

తీస్తున్నాం .. బేటా

లోపల ఉన్న సౌర్యన్‌కు దౌర్యం చెబుతూ గొడను బద్దులకొట్టారు. ఇలా 4 గంటల తర్వాత సౌర్యన్‌ సురక్షితంగా రక్షించగలిగారు. తమ కుమారుడు లిప్ట్ నుంచి క్షేమంగా రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కాపాడిన పోలీసులు, 108 సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. లిప్ట్ నుంచి వచ్చిన చిన్నారి ఒకింత షాక్‌కు గురవవడంతో .. స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించి .. ఆరోగ్యం బానే ఉందని వైద్యులు చెప్పడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Rajiv Swagruha Apartment consists of Fanidhar family. They haveone sons, Sauryan. However, Sauryan took the lipt. The lipt went to the top of the technical reason. the parents were informed the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X