హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రికెట్‌లో కులం..? బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్... ట్విట్టర్‌లో పోస్టు వైరల్...

|
Google Oneindia TeluguNews

'బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్...' సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్టు ఒకటి వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న బీఎస్ఆర్ క్రికెట్ మైదానంలో ఈ నెల 25,26 తేదీల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అంటే ఇప్పటికే ఈ టోర్నమెంట్ ముగిసిపోయింది. ఇందులో పాల్గొనాలంటే తప్పనిసరిగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారై ఉండాలి. ఇతర కులస్తులకు అనుమతి ఉండదు. ఈ కండిషన్స్ చూసి చాలామంది క్రికెట్‌ ఆడేందుకు కూడా ఇంత కుల పట్టింపు ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాహకులు ఏమంటున్నారు...

నిజానికి ఈ బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడేమీ కొత్తగా నిర్వహించట్లేదు. ప్రతీ ఏడాది హైదరాబాద్ కేంద్రంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దీనిపై ప్రముఖ జాతీయ మీడియా చానెల్ ఇటీవల ఆ టోర్నమెంట్ నిర్వాహకులను సంప్రదించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్రిస్మస్,ఆ మరుసటి రోజు నాగోల్‌లో ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు చెప్పారు. గతంలోనూ బ్రాహ్మిణ్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని... స్థానిక అధికారుల అనుమతి మేరకే టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు.ఈ టోర్నమెంట్‌కు రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చిన మొత్తంలో అత్యధిక మొత్తాన్ని స్థానిక ప్రైవేట్ ఎన్జీవో ద్వారా విరాళమిచ్చినట్లు తెలిపారు.

గతంలోనూ ఇలాంటి టోర్నమెంట్స్

గతంలోనూ ఇలాంటి టోర్నమెంట్స్

గతంలో 2017లో పంజాబ్‌లోని జలంధర్‌లోనూ బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్ జరిగినట్లుగా ప్రముఖ మీడియా 'ది ట్రిబ్యూన్' అప్పట్లో ప్రచురించింది. 'బ్రాహ్మిణ్స్ యొక్క,బ్రాహ్మిణ్స్ చేత,బ్రాహ్మిణ్స్ కొరకు' ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొంది. పంజాబ్‌లో డ్రగ్స్ నిషేధం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఇందులో హర్యానా,ఢిల్లీ,రాజస్తాన్ రాష్ట్రాల నుంచి మొత్తం 24 టీమ్స్ పాల్గొనగా అన్నీ బ్రాహ్మిణ్స్ టీమ్స్ కావడం గమనార్హం.

ఇండియన్ క్రికెట్‌లో అసమానతలు..?

ఇండియన్ క్రికెట్‌లో అసమానతలు..?


కుల అసమానతలు ఉన్న భారతీయ సమాజంలో ఇటువంటి పోకడలు కొత్తేమీ కాదు. నిజానికి ఇండియన్ క్రికెట్ టీమ్‌లోనూ బ్రాహ్మణుల ఆధిపత్యమే కొనసాగుతుందన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ప్రస్తుత కేంద్రమంత్రి రాందాస్ అథవాలే 2017లో ఇండియన్ క్రికెట్ టీమ్‌లోనూ ఎస్సీ,ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. గతంలో డా.రాజేష్ కోమత్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ భారత క్రికెట్ టీమ్‌పై విమర్శనాత్మక వ్యాసం రాశారు. 'భారత్‌లో క్రికెట్ అనేది 11 మంది బ్రాహ్మణులు,అగ్ర కులాల వారు ఆడుతుంటే 11 మిలియన్ల సర్వజనులు,బహజనులు దాన్ని వీక్షించి ఫూల్స్ అవుతారు. మీడియాలో ఉన్న మరో 1100 మంది అగ్ర కుల మీడియా ఆ క్రికెట్‌పై విశ్లేషణలు,కామెంటరీ జరుపుతారు. దేశంలోని అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా అన్ని రంగాల్లో దేశం మరింత ప్రజాస్వామికతను సంతరించుకుంటుంది.' అని ఆ వ్యాసంలో డా.రాజేష్ అభిప్రాయపడ్డారు.

English summary
Brahmin Cricket Tournament, that happens every year in Hyderabad. This year was no exception.The dates for the tournament state 25th and 26th December 2020, which means the tournament took place already on Christmas and Boxing day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X