• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మత సామరస్యానికి ప్రతీక ఈ వివాహం .. వధువు ముస్లిం,వరుడు క్రిష్టియన్ .. హిందూ సాంప్రదాయంలో పెళ్లి

|

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఆ వధూవరుల జంట . ఓ పెళ్లి వేడుక సర్వమత సమానత్వాన్ని చాటి చెప్తూ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే అనే భావనను కలిగిస్తుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక ఆదర్శ వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గాలిలో విహారం ..కానీ కాదది ప్రయాణం ... తైవాన్ లో సరదా ఫ్లైట్లు .. వింత సర్వీసులు

 ఖమ్మం జిల్లాలో ఆదర్శ వివాహం

ఖమ్మం జిల్లాలో ఆదర్శ వివాహం

కుల మతాల పేరుతో కొట్టుకు చచ్చే, కేవలం కులాంతర వివాహాలు చేసుకున్నందుకు పరువు హత్యలకు పాల్పడే మనదేశంలో ఖమ్మం జిల్లాలో జరిగిన ఆదర్శ వివాహం అన్ని మతాలు ఒక్కటే అన్న భావనకు ,సర్వ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. సాధారణంగా క్రైస్తవుల ఇళ్ళల్లో జరిగే పెళ్లి అయినా, ముస్లింల ఇంట జరిగే పెరిగి పెళ్లి అయినా వారి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతుంది. క్రైస్తవులు చర్చిలో పెళ్లి చేసుకుంటే, ముస్లింలు వారి సంప్రదాయం ప్రకారం నిఖా జరుపుకుంటారు .

క్రైస్తవ అబ్బాయి, ముస్లిం అమ్మాయి .. హిందూ వివాహం

క్రైస్తవ అబ్బాయి, ముస్లిం అమ్మాయి .. హిందూ వివాహం

ఓ క్రైస్తవ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ,అటు చర్చిలోనూ, ఇటు మసీదులోను కాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం ఆసక్తికరంగా నిలిచింది.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, అన్నారుగూడెంకు చెందిన క్రైస్తవ అబ్బాయి అనిల్ కుమార్, గొల్లగూడెం కి చెందిన ముస్లిం అమ్మాయి షేక్ సోని మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ భిన్న మతాలకు చెందినవారు కావడంతో, వారి మతానికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోకుండా, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ఇంటర్ నుండే ప్రేమలో ఉన్న జంట .. మతాలు వేరు కావటంతో తంటా

ఇంటర్ నుండే ప్రేమలో ఉన్న జంట .. మతాలు వేరు కావటంతో తంటా

అనిల్ కుమార్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే షేక్ సోనీ తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయిన తర్వాత అనిల్ కుమార్ బ్రతుకుతెరువు కోసం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కానీ సోనీ డిగ్రీని కొనసాగించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సోనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న అనిల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను ఒప్పించాడు.

 హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటైన భిన్న మతాలకు చెందిన ప్రేమ జంట

హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కటైన భిన్న మతాలకు చెందిన ప్రేమ జంట

వీరి పెళ్లికి షేక్ సోని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ముస్లిం యువతి అయ్యుండి, క్రిస్టియన్ ని ప్రేమించి, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు వారి ఆదర్శప్రాయమైన నిర్ణయానికి అంగీకరించి వారికి సహకరించారు. దీంతో హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు. కేవలం కులాలు, మతాల కోసం కొట్టుకు చస్తూ, హత్యలు చేస్తున్న వారున్న నేటి రోజుల్లో వీరి వివాహం కుల,మత పిచ్చిలో ఉన్నవారికి కనువిప్పు .

English summary
The ideal marriage in Khammam district symbolizes the idea that all religions are one, and all religions are harmonious. A Christian young man, a Muslim girl, gets married according to Hindu tradition, not in a church or a mosque.This ideal marriage took place in Tallada Mandal, Annarugudem, Khammam District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X