విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్సాస్ రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగువారి మృతదేహాలను స్వదేశం తరలించండి, కేంద్రానికి లక్ష్మణ్ లేఖ

|
Google Oneindia TeluguNews

అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు తెలుగు వారిని స్వదేశం తరలించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌కు చెందిన రాజా గవిని(41), దివ్య ఆవుల (34)తోపాటు రాజా స్నేహితుడు ఏపీకి చెందిన ప్రేమనాథం రామనాథ్‌తో కలిసి ప్రయాణిస్తోండగా టెక్సాస్‌లో సోమవారం ఉదయం కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడంతో వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

<strong>అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణ దంపతులు, ఏపీ వ్యక్తి దుర్మరణం, ఒంటరైన చిన్నారి</strong>అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణ దంపతులు, ఏపీ వ్యక్తి దుర్మరణం, ఒంటరైన చిన్నారి

కేంద్రానికి లేఖ

కేంద్రానికి లేఖ

మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు లక్ష్మణ్ వివరించారు. అమెరికాలోని రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి.. మృతదేహాలను వీలైనంత తర్వగా భారత్ తరలించాలని లక్ష్మణ్ కోరారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి కూడా లక్ష్మణ్ లేఖ రాశారు.

ప్రమాదంతో

ప్రమాదంతో

ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని, దివ్య ఆవుల భార్యాభర్తలు. వీరిద్దరూ అమెరికా టెక్సాస్‌లోని ప్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నారు. సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచి పెట్టారు. అనంతరం అక్కడ్నుంచి తిరిగి వస్తున్న క్రమంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు స్నేహితుడు ప్రేమ్‌నాథ్ రామనాథంను తమ వెంట కారులో తీసుకెళ్లారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | 5 Key Deals Between India & USA | Oneindia Telugu
ముగ్గురి మృతి

ముగ్గురి మృతి

ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఈ ముగ్గురూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు రాజా, దివ్యల మృతితో రియా ఒంటరిగా మారిపోయింది. అమెరికాలోనే స్థిరపడి ఇల్లు కూడా కట్టుకుంటున్న దంపతులు.. ఎంతో ఆనందంగా జీవితం గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదం మూడు తెలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

English summary
Bring back bodies of three Indians killed in US car crash, telangana bjp state president laxman ask Central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X