హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఆర్కే భవన్‌లో ఉద్యోగికి కరోనా పాజిటివ్: హోం క్వారంటైన్‌లో ఏడో అంతస్తు సిబ్బంది..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతీరోజు సెంచరీ మార్క్ దాటుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కవగా వస్తున్నాయి. సిటీ నడిబొడ్డున గల బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉద్యోగులు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏడో అంతస్తును రెండుసార్లు శానిటైజ్ చేస్తామని పేర్కొన్నారు.

ఏడో అంతస్తులోని సిబ్బందికి వైరస్ సోకింది. దీంత వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఎనిమిదో అంతస్తు ఆర్థికశాఖ కార్యాలయంలో సిబ్బంది రావడం లేదు. కొందరు మాత్రమే ఆఫీసుకు వస్తున్నారు. మిగతా వారంతా భయపడుతున్నారు.

brk bhavan employee got coronavirus..

మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 132 కేసులు నమోదవుయ్యాయి. మొన్న 200 కేసులు రికార్డవడంతో ఆందోళన నెలకొంది. ఆదివారం 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 137కి చేరింది.

Recommended Video

Covid 19 : 210 New Cases Recorded In Andhra Pradesh

రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 3500 మార్క్ దాటింది. నిన్నటివరకు 3650 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో వైరస్ తగ్గి 1742 మంది డిశ్చార్జయి.. ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన 1771 మందికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం చనిపోయిన 14 మందితో కలిపి 137 మంది మృతిచెందారు.

English summary
brk bhavan seventh floor financial department outsourcing employee got coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X