ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ చేరుకున్న సీఎంలు, జాతీయ నేతలు: కేసీఆర్ బీఆర్ఎస్ సభకు అంతా సిద్ధం

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: జాతీయ రాజకీయాలకు తొలి అడుగుగా ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నిర్వహించబోయే బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా రూపొంతతరం చెందిన తర్వాత నిర్వహించబోయే తొలిసభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మంత్రి హరీశ్ రావు సభ ఇంఛార్జీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉంటూ సహచర నేతలతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజరు కానుండటంతో లక్షల సంఖ్యలో జనసమీకరణ కూడా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ సభలో పాల్గొననున్నాయి.

ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం ఏకంగా 100 ఎకరాలు సిద్ధం చేయడం గమనార్హం. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ఫ్రూఫ్‌తో వేదికను రూపొందించారు. వేదికపై 200 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో.. పార్కింగ్ కోసం స్థలాలు సిద్ధం చేశారు. బహిరంగ సభలో 50 ఎల్ఈడీ స్క్రీన్లు, 100 మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు. వెయ్యింది వాలంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వహించనున్నారు. మరోవైపు, భారీ హోర్డింగ్‌లు, కేసీఆర్, కేటీఆర్ సహా నేతల కటౌట్లు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తోరణాలతో ఖమ్మం గులాబీ మయంగా మారింది. ఇది ఇలావుండగా, రేపటి సభ కోసం పలువురు నేతలు హైదరాబాద్ చేరుకుంటున్నారు.

 BRS meeting: Pinarayi vijayan, Arvind Kejriwal, bhagwant mann, akhilesh yadav, d raja reached hyderabad

హైదరాబాద్ చేరుకున్న కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు

బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ చేరుకున్నారు. వీరు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వీరికి హోంమంత్రి మహమూద్ అలీ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ చేరుకున్న కేజ్రీవాల్.. రాష్ట్ర ఆప్ నేతలతో భేటీ అయ్యారు. ఆప్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

మరికొంత సేపటికే సీపీఐ అధ్యక్షుడు డీ రాజా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. మరోవైపు, హైదరాబాద్ చేరుకున్న ఎస్పీ అధినేత, యూపీ మాజీ అఖిలేష్ యాదవ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
వీరితోపాటు పలువురు జాతీయ నేతలు కూడా బుధవారం ఉదయం వరకు హైదరాబాద్ చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం సభలో జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

English summary
BRS meeting: Pinarayi vijayan, Arvind Kejriwal, bhagwant mann, akhilesh yadav, d raja reached hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X