హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నేతల ఫైర్, పీఎస్‌లో ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై విమర్శలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గణతంత్ర వేడుకలు సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు.. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే, కొందరు బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కౌశిక్ రెడ్డిపై బీజేపీ ఫిర్యాదు

కౌశిక్ రెడ్డిపై బీజేపీ ఫిర్యాదు


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై విమర్శలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసైపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గవర్నర్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చేసిన బిల్లులు, ఫైళ్లను గవర్నర్.. ఎందుకు దాచుకుంటున్నారని అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత ఇది రాజ్యాంగా? అంటూ నిలదీశారు.

కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతల ఫైర్: కేసీఆర్ సారీ చెప్పాలని డిమాండ్

గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్, ఒక మహిళను ఇలాంటి నీచమైన పదాలను ఉపయోగించి అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వానికి లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోపాటు బీజేపీ నేతలు కౌశిక్ రెడ్డి, కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
BRS MLC Koushik Reddy controversial comments on TS Governor Tamilisai Soundararajan: BJP files complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X