వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్‌గా ప్రముఖ రచయిత బిఎస్ రాములు

ప్రముఖ రచయిత బిఎస్ రాములు తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. తన రచనల ద్వారా తెలంగాణ సమాజ విశ్లేషణను చేస్తూ వస్తున్న ఆయనకు తగిన గౌరవం దక్కింది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన రాములు తెలంగ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ రచయిత బిఎస్ రాములు తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. తన రచనల ద్వారా తెలంగాణ సమాజ విశ్లేషణను చేస్తూ వస్తున్న ఆయనకు తగిన గౌరవం దక్కింది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన రాములు తెలంగాణ ఉద్యమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించడమే కాకుండా, బీసీల జీవన స్థితిగతులపై వైవిధ్యభరితమైన రచనలు చేశారు.

1949 ఆగస్టు 23న కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఆయన ఒక సాధారణ కార్మిక కుటుంబంలో పుట్టారు. జగిత్యాలలోని ప్రాథమిక స్కూలులో, 1960-67మధ్య హైస్కూలు విద్య, 1970-74మధ్య ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాలలో కాలేజీ ఆయన చదువుకున్నారు. తర్వాత కాకతీయ వర్సిటీ నుంచి తెలుగుపండిత శిక్షణ తీసుకున్నారు. 1973లో శ్యామలను వివాహమాడారు.

BS Ramulu appointed as BC commission chairman

1975లో సాంఘికసంక్షేమశాఖలో ఉద్యోగం ప్రారంభించి 2007లో పదవీవిరమణ చేశారు. 1970-77 నుంచి ఉద్యోగసంఘాల నిర్మాణంతోపాటు పీడీఎ్‌సయూ, ఆర్‌ఎ్‌సయూ, విద్యార్థియువజన సంఘాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. పలు సైద్ధాంతిక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. తెలంగాణ రచయితలు, కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

దాదాపు 150కిపైగా కథలు, ఆరు నవలలు, 150 సిద్ధాంత వ్యాసాలు, 150 సాహిత్య వ్యాసాలు,పది తాత్విక గ్రంథాలు రాశారు. 1990లో విశాల సాహిత్య అకాడమీ ప్రారంభించారు. అకాడమీ కింద పలు సాహిత్య సభలు, సిద్ధాంత అధ్యయనాలు చేపట్టి వర్థమాన రచయితలకు మార్గదర్శనం చేశారు. మద్యపాన, అవినీతి వ్యతిరేక ఉద్యమాలను చురుకుగా ముందుండి నిర్వహించారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించారు.

2002లో సామాజిక తాత్విక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి పలు పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రచురించారు. 1992 నుంచి కొండా లక్ష్మణ్‌బాపూజీ జలదృశ్యంలో రచయితలు, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. 1991లో రాములు వెలువరించిన గతితర్క తత్వదర్శన భూమిక గ్రంథం తెలుగునాట భావజాల చర్చ తీరును పూర్తిగా మార్చేసింది.

1984లో అరెస్టు కావడంతో వారంపాటు లాకప్‌లో, 20రోజులు కరీంనగర్‌ జిల్లా జైలులో శిక్ష అనుభవించారు. రాములు పలు అవార్డులు అందుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావు అవార్డు, బీడీ కార్మికులపై వెలువరించిన 'బతుకుపోరు' నవలకు పురస్కారం లభించింది. 1992లో కొండా లక్ష్మణ్‌బాపూజీ ఫౌండేషన్ పురస్కారం, 1995లో పాలకుర్తి సోమన కళాపీఠం పురస్కారం, త్రిపురనేని రామస్వామిచౌదరి పురస్కారంతోపాటు పలు అవార్డులు అందుకున్నారు.

2007లో నిజాంకాలేజీలో కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన తెలంగాణ సంబురాల్లో తెలంగాణ తల్లిని రూపొందించినందుకు స్వర్ణకంకణం ధారణంతోపాటు ఆయనకు ఘన సన్మానం జరిగింది.

బీసీ కమిషన్‌ సభ్యులు

డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావు: ఉమ్మడి రాష్ట్రంలో రెండు దఫాలు 2004 నుంచి 2009 దాకా బీసీ కమిషన్ సభ్యుడిగా చేశారు. బీసీ సంక్షేమ సంఘంలో కీలక భూమిక పోషించి, ఉద్యమనేతగా, రచయిత, వక్తగా ఆయనకు పేరుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ(తెలుగు), పీహెచ్‌డీ చేశారు. కరీంనగర్‌ జిల్లా హజూరాబాద్‌కు చెందిన ఈయన దాసరి సామాజికవర్గానికి చెందిన వారు.

జూలూరు గౌరీశంకర్‌: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రచయిత, కవి అయిన గౌరీశంకర్‌, విశ్వకర్మ సామాజికవర్గానికి చెందినవారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసి తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఈడిగ ఆంజనేయులుగౌడ్‌: జోగులాంబ గద్వాల జి ల్లాకు చెందిన ఈయన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి... ఉస్మానియా వర్సిటీలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన గౌడ్‌ తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షునిగా పనిచేశారు.

English summary
A prominent writer BS Ramulu has bee appointeed as the chairman as Telangana BC commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X