• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాలుగు నెలల కోసం కాంగ్రెస్ డ్రామా-'పంజాబ్‌లో దళిత సీఎం'పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్...

|

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ దళిత సిక్కు వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వడం వ్యూహాత్మకమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ పొత్తుతో బరిలో దిగుతుండటం... రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటోందన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది.తాజాగా తెలంగాణ బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నిర్ణయంపై స్పందించారు.

Akali Dal-BSP alliance: పంజాబ్‌లో కొత్త పొత్తు-27 ఏళ్ల తర్వాత మళ్లీ జతకడుతున్న అకాలీదళ్-బీఎస్పీAkali Dal-BSP alliance: పంజాబ్‌లో కొత్త పొత్తు-27 ఏళ్ల తర్వాత మళ్లీ జతకడుతున్న అకాలీదళ్-బీఎస్పీ

'టీఆర్ఎస్ దళిత బంధు బిస్కెట్ లాంటిదే... కాంగ్రెస్ పార్టీ 4 నెలల కోసం పంజాబ్ దళిత సీఎం డ్రామా. 1947లో అంబేడ్కర్‌ను ఓడించెందెవరు.. 1962లో సంజీవయ్యను సీఎం చేసి తిప్పలు పెట్టిందెవరు... ఇక 2014 తెలంగాణ దళిత సీఎం సంగతి దేవుడెరుగు.అయినా పదవులు ఎవడో ఇచ్చుడేంది.లడాయి చేసి గుంజుకోవాలె గాని...' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

 bsp rs praveen kumar reaction over congress appointing dalit cm in punjab

బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సైతం పంజాబ్‌‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ముంగింట్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పొలిటికల్ జిమ్మిక్కుగా అభివర్ణించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాల పట్ల దళితులు అప్రమత్తంగా ఉండాలని... కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే దళిత సీఎంను ఎంపిక చేశారని అన్నారు.కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడ దళితుల విశ్వాసాన్ని చూరగొనలేదని పేర్కొన్నారు.

'కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి అభినందనలు. కాంగ్రెస్ ఈ పని ముందే చేసి... చరణ్‌జిత్ సింగ్‌ ఐదేళ్లు సీఎంగా ఉండే అవకాశం ఇస్తే బాగుండేది.అసెంబ్లీ ఎన్నికల ముందు దళిత సీఎంను తెరపైకి తీసుకురావడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే.వచ్చే అసెంబ్లీ ఎన్నికలను నాన్ దళిత్ నాయకత్వంలో ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీన్నిబట్టి కాంగ్రెస్‌ను దళితులు నమ్మే పరిస్థితి లేదు.' అని మాయావతి పేర్కొన్నారు.

ఆనాడు అంబేడ్కర్‌ను మించిన ఇంటలెక్చువల్ కాంగ్రెస్‌కు దొరకలేదు కాబట్టే... రాజ్యాంగ నిర్మాణ బాధ్యతను ఆయనకు అప్పగించారని మాయావతి పేర్కొన్నారు.ఆ సమయంలో అంబేడ్కర్‌ను మించిన తెలివితేటలు ఉన్న వ్యక్తి దొరికి ఉంటే... ఆ అవకాశం అంబేడ్కర్‌కు ఇచ్చి ఉండేవారు కాదని అన్నారు. శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ పొత్తుకు భయపడే కాంగ్రెస్ దళిత సీఎంను ఎంపిక చేసిందన్నారు.రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడే అందరికీ దళితులు గుర్తుకొస్తారని మండిపడ్డారు.అది పంజాబ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా దళితులు,బీసీలు బీజేపీ,కాంగ్రెస్‌ ప్రలోభాలకు లొంగరనే నమ్మకం తనకు ఉందన్నారు.

శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ పొత్తు :

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్,బీఎస్పీ పార్టీలు పొత్తుతో బరిలో దిగుతున్నాయి.ఈ ఏడాది జూన్‌లోనే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ రెండు పార్టీలు మళ్లీ పొత్తు కుదుర్చుకున్నాయి.పొత్తు ప్రకారం... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను 20 స్థానాల్లో బీఎస్పీ,మిగతా స్థానాల్లో శిరోమణి అకాలీదళ్ పోటీ చేయనున్నాయి.1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్-బీఎస్పీలు జతకట్టడం ఇదే మొదటిసారి.అప్పటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుతో బరిలో దిగగా... 13 లోక్‌సభ స్థానాలకు గాను 11 స్థానాలను కైవసం చేసకున్నాయి. ఇందులో అకాలీదళ్ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించగా... బీఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది.

English summary
RS Praveen Kumar on Punjab Dalit CM-Congress’s appointment of CS Channi as first Dalit CM of Punjab for just 4 months is just a ploy to prevent BSP-SAD Alliance from coming to power. It is so strange that in the last 55 years, Cong couldn’t find one from 32% of SC population to lead the state,said RS Praveen Kumar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X