వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిటెక్ విద్యార్థిని ఝాన్సీ హత్య కేసులో ట్విస్ట్: సిఐ బదిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిటెక్ విద్యార్థిని ఝాన్సీ తల్లి, భర్త మరి కొంత మందితో కలిసి చేసిన హత్య కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వర్లును బదిలీ అయ్యారు. ఆయన బదిలీపై నిరసన వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో కొంత మంది పోస్టులు పెట్టారు. కొందరు రాజకీయ నేతల ఒత్తిడి కారణంగానే సీఐని బదిలీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

బిటెక్ విద్యార్థిని ఝాన్సీ కేసులో మరో ట్విస్ట్: భర్తతో తల్లికి అక్రమసంబంధంబిటెక్ విద్యార్థిని ఝాన్సీ కేసులో మరో ట్విస్ట్: భర్తతో తల్లికి అక్రమసంబంధం

ఏది ఏమైనా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా విది నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసీన నక్రేకల్ సీఐకి మాత్రం ప్రతి సామాన్యుడు హ్యాట్యాఫ్ చెప్తున్నారని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో తన కామెంట్ పెట్టాడు. ఝాన్సీ హత్య కేసులో తెలిసోతెలియకో ఒత్తిడి తెచ్చిన రాజకీయ నేతలు ఎక్కడ తాము పోలీసులపై తెచ్చిన ఒత్తిడి బయటకు వస్తుందో అనే భయంతోనే సీఐని బదిలీ చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు.

కాపురం చేయాలని భర్త హింసించాడు, పురుగుల మందు తాగించి చంపేశారు కాపురం చేయాలని భర్త హింసించాడు, పురుగుల మందు తాగించి చంపేశారు

BTech student Jhansi murder case: CI transferred

నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం నోముల గ్రామంలో భర్త విజయేందర్ రెడ్డి, తల్లి పద్మ పురుగుల మందు తాగించి హత్య చేసిన విషయం తెలిసిందే. కళాశాలలో ఫేర్‌వేల్ పార్టీ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పినా వినకుండా బలవంతంగా కాలేజీ నుంచి తీసుకుని వచ్చారని, తనతో కాపురం చేయాలని భర్త విజయేందర్ రెడ్డి ఝాన్సీని హింసించాడని, ఆమె లొంగకపోవడంతో తల్లి పద్మతో కలిసి విజయేందర్ రెడ్డి పురుగుల మందు ఇచ్చి చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఝాన్సీ కేసు మరో మలుపు: ప్రియుడి సాక్ష్యమే కీలకం, తల్లి, భర్త కలిసి చంపేశారు ఝాన్సీ కేసు మరో మలుపు: ప్రియుడి సాక్ష్యమే కీలకం, తల్లి, భర్త కలిసి చంపేశారు

ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి, కన్నతల్లి గుర్రపు పద్మ హత్య చేయగా, ఝాన్సీ అన్న శివశంకర్‌రెడ్డి, ఆమె అత్త మామలు జయమ్మ, జానకిరాంరెడ్డి, మరిది అజయేందర్‌రెడ్డిలతోపాటు కారు డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ హత్యలో పరోక్షంగా భాగం పంచుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

English summary
Controversy is eruting on the transfer of Nakrekal CI Venkateswarlu, who is probing on death of BTech student Jhansi's death case at Nomula Village in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X