వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అసెంబ్లీలో 2018-2019కి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినా .. ఎవరికీ ఆర్థికశాఖ కేటాయించకపోవడంతో అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్, మండలిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి పద్దును చదివి వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైందన్నారు సీఎం కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు సంక్షేమ రంగాలు పడకేశాయని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నిరంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ప్రస్తావించారు. అధికారం చేపట్టిన 9 నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు.

విద్యుత్ సమస్య తీరడంతో వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతరం కరెంట్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని .. యావత్ దేశానికి తెలంగాణ మోడల్ గా నిలువడం గర్వకారణమన్నారు. వివిధ అంశాల్లో నిర్ణీత లక్ష్యంతో ముందుకుసాగుతూ .. తక్కువ సమయంలో డెవలప్ సాధించామని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ వృద్ధి దేశ సగటు కన్నా తక్కువగా ఉండేదని .. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్టు పెరిగిందనే విషయాన్నే బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు దోహదపడిందన్నారు.

Budget session telangana budget will be 2 lakh crores

Newest First Oldest First
2:39 PM, 22 Feb

శని, సోమవారం బడ్జెట్ పై సభలో చర్చ
2:39 PM, 22 Feb

ఆదివారం అసెంబ్లీకి సెలవు
2:34 PM, 22 Feb

డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు
2:34 PM, 22 Feb

రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
2:34 PM, 22 Feb

ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు
2:33 PM, 22 Feb

ముగిసిన బీఏసీ సమావేశం
1:28 PM, 22 Feb

ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067కోట్లు కేటాయిస్తున్నాం.
1:28 PM, 22 Feb

దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నాం. వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తాం.
1:28 PM, 22 Feb

పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నాం.
1:28 PM, 22 Feb

2018-19 వృద్ధిరేటు 10.6 శాతంగా ఉంది
1:27 PM, 22 Feb

8.58లక్షల ఉద్యోగాలు కల్పించాం
1:27 PM, 22 Feb

టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు
1:27 PM, 22 Feb

టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు
1:27 PM, 22 Feb

500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు
1:27 PM, 22 Feb

పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు
1:26 PM, 22 Feb

ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు
1:26 PM, 22 Feb

నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు
1:26 PM, 22 Feb

వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు
1:26 PM, 22 Feb

ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
1:26 PM, 22 Feb

రైతు బంధు పథకం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు
1:25 PM, 22 Feb

రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు
1:25 PM, 22 Feb

రైతు బీమా కోసం రూ.650కోట్లు
1:25 PM, 22 Feb

బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు
1:25 PM, 22 Feb

రైతు రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు
1:25 PM, 22 Feb

మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు
1:25 PM, 22 Feb

ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు
1:24 PM, 22 Feb

ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు
1:24 PM, 22 Feb

నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు
1:24 PM, 22 Feb

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు
1:23 PM, 22 Feb

రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
READ MORE

English summary
The KCR will introduce the Telangana Budget. The vote on the account is brought by the Assembly for 4 months. This time, the Finance Ministry is not entrusted with the KSr itself. Nedurumalli Janardhana Reddy is presented budjet in the joint state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X