• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిర్లక్ష్యమే: పాత భవనం కూలి ఇద్దరు మృతి, కెటిఆర్ వార్నింగ్(పిక్చర్స్)

|

హైదరాబాద్‌: ఇప్పటికే కూల్చాల్సిన ఓ కాలం చెల్లిన పాత భవనం కూలిపోయింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన సికింద్రాబాద్‌ మెట్టుగూడ డివిజన్‌లోని చిలకలగూడలో చోటుచేసుకుంది.

శిథిలాల్లో చిక్కుకుని ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని చికెన్‌షాపు యజమాని అక్బర్(40), అతడి సహాయకుడు వాజిద్(33) అలియాస్ అహ్మద్‌గా గుర్తించారు. భవనం కూలిన సమయంలో అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని స్థానికులు చెప్పడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సహాయ చర్యలు కొనసాగించారు. అయితే వారి ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు.

మంత్రి కెటిఆర్ ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క పురాతన భవనం కూడా ఉండరాదని, పాతబడి, ఎప్పుడు కూలుతాయా అన్నట్టున్న వాటిని తక్షణమే కూల్చివేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వారిని విధుల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

ఇటీవలి ఇళ్లు కూలిన దుర్ఘటనలపై అధికారులతో సమీక్షించిన ఆయన, గతంలోనే పురాతన భవనాలు తొలగించాలని చేసిన సూచనలను పట్టించుకోలేదని ఆగ్రహించారు. భవనాలపై ఏవైనా కోర్టు కేసులు నడుస్తుంటే, వాటి ముందు బోర్డులు పెట్టాలని, అందులో ఎవరూ నివాసం ఉండకుండా చూడాలని కేటీఆర్ ఆదేశించారు.

శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు పనులను తక్షణం చేపట్టాలని, ఆపై వాటిని ప్రభుత్వ నిధులతోనే కూల్చివేయాలని, అందుకు స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

నగరంలో ఇప్పటికే కూల్చాల్సిన ఓ కాలం చెల్లిన పాత భవనం కూలిపోయింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన సికింద్రాబాద్‌ మెట్టుగూడ డివిజన్‌లోని చిలకలగూడలో చోటుచేసుకుంది.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

శిథిలాల్లో చిక్కుకుని ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని చికెన్‌షాపు యజమాని అక్బర్(40), అతడి సహాయకుడు వాజిద్(33) అలియాస్ అహ్మద్‌గా గుర్తించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

భవనం కూలిన సమయంలో అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని స్థానికులు చెప్పడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సహాయ చర్యలు కొనసాగించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

అయితే వారి ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు. భవనం కూలిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో శిథిలాలు తొలగించే పనులు చేపట్టారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. చిలుకలగూడలోని పాత పోలీస్‌స్టేషన్ భవనానికి సమీపంలో ఉన్న ఈ భవనాన్ని 1940లో నిర్మించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

శిథిలావస్థకు చేరుకుని ప్రమాదపుటంచుల్లో ఉన్న ఈ భవనంలో చికెన్ షాపు, జిరాక్స్ సెంటర్ వంటి చిన్నచిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి. నగరంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల జాబితాలో దీనిని కూడా ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు చేర్చారు. దానిని కూల్చివేయాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

మూడు నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ భవంతి మరింత దెబ్బతింది. వర్షాలకు బాగా నానిపోయి మెత్తబడి ఉంది. ఈ భవనం కిందిభాగంలో చికెన్‌షాపు నిర్వహిస్తున్న అక్బర్, అతని వద్ద పనిచేస్తున్న అహ్మద్ సోమవారం రాత్రి దుకాణం మూసివేసేందుకు షట్టర్‌ను కిందికి గుంజారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ఈ సమయంలో ఒక్కసారిగా భవనం కుప్ప కూలిపోయింది. శిథిలాల కింద ఇద్దరూ చిక్కుకుపోయారు. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో సమీపంలో ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రజల సహకారంతో శిథిలాలు తొలగించి ఇద్దరిని బయటకు తీశారు. వాజిద్ అప్పటికే చనిపోగా.. అక్బర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

సమాచారం అందుకున్న మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ ఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలను పరిశీలించారు. చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి కూడా ఘటనాస్థలాన్ని సందర్శించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క పురాతన భవనం కూడా ఉండరాదని, పాతబడి, ఎప్పుడు కూలుతాయా అన్నట్టున్న వాటిని తక్షణమే కూల్చివేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వారిని విధుల నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

English summary
At least 2 people were dead and 5 others injured on Monday after an old building collapsed in Secunderabad, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X