వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనుగోళ్ళ కోసం వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న కంపెనీలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా వినియోగదారులు కొనుగోళ్ళు లేక కంపెనీలు విలవిలలాడుతున్నాయి. తమ వద్ద ఉన్న వస్తువులను వెంటనే వదిలించుకొనేందుకు బంపర్ ఆపర్లను ప్రకటిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉచితంగా ఫోన్లను ఇస్తామని ప్రకటిస్తే,...మరో కంపెనీ ల్యాప్ ట్యాప్ తీసుకెళ్ళండి వచ్చే ేడాది డబ్బులు చెల్లించండి అంటూ ఆపర్ ప్రకటించింది.

పెద్ద నగదు నోట్ల రద్దుతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజుకు లక్షలాది రూపాయాల్లో వ్యాపారం నిరహించే వారు కూడ వందల్లో విక్రయాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకు డబ్బులు అందుబాటులోకి వచ్చే వరకు పరిస్థితిలో మార్పు ఉండదని వ్యాపారులు అభిప్రాయంతో ఉన్నారు.

వినియోగదారులను ప్రసన్నం చేసుకొనేందుకుగాను కంపెనీలు పోటీపడుతూ ఆపర్లను ప్రకటిస్తున్నాయి. తమ ఉత్పత్తులు చౌకగా విక్రయిస్తామని ఓ కంపెనీ ప్రకటిస్తే...తమ వద్ద ఉన్న వస్తువులను తీసుకెళ్ళి వచ్చే ఏడాది డబ్బులు చెల్లించాలని మరో కంపెనీ ఆపర్ ఇస్తోంది.మరో కంపెనీ తమ వస్తువును ఉచితంగా ఇస్తామని బంపర్ ఆపర్ ప్రకటించింది.

bumper offers for consumers from various companies to increase sales

ఆపర్ల కోసం పోటీపడుతున్న కంపెనీలు

మొబైల్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఈ మార్కెట్ గణనీయంగా పడిపోయింది. పెద్ద నగదు నోట్ల రద్దు వల్ల వినియోగదారులు అవసరమైతే తప్ప వస్తువులను కొనుగోలు చేయడం లేదు.దీని ప్రభావం అన్ని రకాల ఉత్తపత్తుల విక్రయాలపై పడింది. అయితే ప్రధానంగా మొబైల్ళపై పడింది.

పెద్ద నగదు నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ల విక్రయాలను తిరిగి పుంజుకొనేలా చేసేందుకు కంపెనీలు ప్రయత్నాలను ప్రారంభింాచాయి..,మినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకుగాను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే పోన్లను కొోనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాయి కంపెనీలు. ఏడాది పాటు వాయిదా పద్దతిలో మొబైల్ డబ్బులను చెల్లించే వెసులుబాటును మొబైల్ కంపెనీలు ప్రారంభించాయి.

ల్యాప్ టాప్ ను కొనుగోలు చేసేందుకుగాను ఓ కంపెనీ మంచి ఆఫర్ ను వినియోగదారులకు ఇచ్చింది.ల్యాప్ టాప్ వెంటనే ఇంటికి తీసుకెళ్ళే అవకాశం కల్పిస్తోంది. కాని , వచ్చే ఏడాది మాత్రం ఈ ల్యాప్ టాప్ కు సంబందించిన డబ్బులను చెల్లించాలని బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీల ఉత్తత్తి చేసే కంపెనీలు కూడ ఈ రకంగానే ఆఫర్లు ప్రకటిస్తు వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.

English summary
various offers for consumers announce various companies for buy their products.some companies offers zero down payment, some companies offered to people take goods and pay money next year,many companies plan for attract the consumers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X