హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవి పాటించాల్సిందే: హైదరాబాద్‌లో టపాసుల పేల్చుకోవడంపై పోలీసుల ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దీపావళి పండుగ రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని తెలంగాణ పోలీసులు గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, పోలీస్ డిపార్టుమెంట్ పేరుతో ఓ ప్రకటన చేశారు.

బాణసంచాకు ఓకే కానీ: సుప్రీం షరతులు, దీపావళి, క్రిస్‌మస్‌, న్యూఇయర్‌లలో ఆ టైంలోనే కాల్చాలి బాణసంచాకు ఓకే కానీ: సుప్రీం షరతులు, దీపావళి, క్రిస్‌మస్‌, న్యూఇయర్‌లలో ఆ టైంలోనే కాల్చాలి

కమిషనర్ పేరుతో ప్రకటన

కమిషనర్ పేరుతో ప్రకటన

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్, ఐపీఎస్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. దీపావళి పండుగ సమయంలో టపాకాయలు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు

ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాత్రి రెండు గంటలు మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ఆరో తేదీ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 9వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పరిమితి దాటొద్దు,

పరిమితి దాటొద్దు,

ఈ మూడు రోజుల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు టపాసుల శబ్దాలతో పాటు సంగీతం, డ్రమ్స్ వంటి శబ్దాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచించిన పరిమితి దాటకూడదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, రోడ్ల పైన, పబ్లిక్ ప్రాంతాలలో టపాసులు కాల్చడానికి అనుమతులు లేవని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

ఇదిలా ఉండగా, దీపావళి పండుగ సందర్భంగా టపాసులు రాత్రి ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే కాల్చాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉన్న టపాసులు కాల్చాలని కూడా సూచించింది.
బాణసంచా కాల్చడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దాదాపు పది రోజుల క్రితం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బాణసంచాను పూర్తిగా నిషేధించలేమని స్పష్టం చేసింది. టపాసుల అమ్మకాలపై నియంత్రణ అవసరమని చెప్పింది. కాలుష్య రహిత టపాసులు అమ్మేలా చూడాలన్నారు. లైసెన్స్ ఉన్నవారే టపాసులు అమ్మాలని షరతు విధించింది. బాణసంచా కాల్చే సమయంపై నిబంధనలు విధించింది. రాత్రి ఎనిమిది గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చాలని చెప్పింది. దీపావళి రోజు ఈ రెండు గంటల సమయంలో బాణసంచా కాల్చాల్సి ఉంటుంది. ఈ నిబంధన అన్ని మతాలకు, అన్ని సందర్భాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రిస్‌మస్ రోజున అర్థరాత్రి గం.11.55 నిమిషాల నుంచి గం.12.30 వరకు కాల్చవచ్చునని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాలుస్తారు కాబట్టి, 35 నిమిషాల సమయం ఇచ్చింది. అలాగే, కొత్త సంవత్సరం రోజున అర్ధరాత్రి గం.11.45 నుంచి గం.12.45 వరకు గంటసేపు కాల్చవచ్చునని చెప్పింది. అలాగే, అన్ని మతాల పండుగలు అయినా లేదా వ్యక్తిగతంగా పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లు అయినా సుప్రీం కోర్టు ఆదేశాలు వర్తిస్తాయని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ప్రపంచంలోనే భారత దేశంలో ఎక్కువ కాలుష్య నగరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొది.

English summary
Bursting of crackers banned in Hyderabad and Secunderabad on roads says hyderabad police on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X