వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్లలోకి దూసుకెళ్లిన బస్సు, డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం.. బస్సులో 25 మంది విద్యార్థులు...

|
Google Oneindia TeluguNews

నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెల్దండ మండలం కొట్ర గ్రామం వద్ద బస్సు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. అయితే విద్యార్థులు సహా డ్రైవర్‌ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. బస్సు యాక్సిడెంట్ గురైన సమయంలో షాక్‌నకు గురయ్యామని విద్యార్థులు చెప్తున్నారు.

ఎప్పటిలాగే ఉదయం నుంచి బస్సు బయల్దేరింది. ఏమైందో ఏమో కాని కొట్ర గ్రామం వద్ద బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు హాహాకారాలు పెట్టారు. బస్సు బోల్తా కొట్టకపోవడంతో పెను ప్రమాదం నుంచి విద్యార్థులు బయటపట్టారు. బస్సు ప్రమాద సమయంలో అందులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి బయటపడ్డాక కూడా వారు గజగజ వణికిపోయారు. ప్రమాదం గురించి తెలిసి పేరెంట్స్ ఆందోళన చెందారు.

bus accident at nagarkurnool dist

బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని తేలింది. దీంతో పేరెంట్స్ స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. వేలకు వేలు ఫీజు కట్టించుకొని నిపుణులైన డ్రైవర్లను మాత్రం పెట్టుకోరని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా డ్రైవర్లను కూడా మార్చాలని కోరుతున్నారు. కొట్ర గ్రామం వద్ద బస్సు ప్రమాదం మాత్రం వెల్దండ మండలంలో కలకలం రేపింది. డ్రైవర్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
school bus accident at nagar kurnool dist kotra village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X