వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత నగదు మార్పిడి చేస్తామని వ్యాపారిని మోసం చేసిన కానిస్టేబుళ్ళు

పాత నగదు నోట్లను మార్పిడి చేస్తామని చెప్పి కానిస్టేబుళ్ళ సహాయంతో స్నేహితుడిని మోసం చేశాడు ఓ వ్యక్తి. ఖైరతాబాద్ సమీపంలోని ఎంఎస్ మక్తాకుచెందిన మల్లేష్ వికారాబాద్ లోని తన స్నేహితుడు ప్రశాంత్ కు ఫోన్ చేసి

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజగుట్ట : పెద్ద నగదు నోట్లను మార్పిడి చేస్తామని వ్యాపారిని మోసం చేశారు కానిస్టేబుళ్ళు. కానిస్టేబుళ్ళ సహయంతో స్నేహితుడే ఈ పథకం పన్నాడని ఆలస్యంగా గ్రహించాడు ప్రశాంత్ అనే వ్యాపారి.మోసపోయాయని తెలుసుకొన్న బాధితుడు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు.

హైద్రాబాద్ ఖైరతాబాద్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో నివసించిే మల్లేష్ తన స్నేహితుడు ప్రశాంత్ కు ఫోన్ చేసి పాత నగదును మార్పిడి చేస్తానని నమ్మించాడు. వికారాబాద్ లో ప్రశాంత్ చిన్న వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

businessman cheated by constables

రద్దైన పాత నోట్లను మార్చుకొనేందుకు ప్రశాంత్ ఇబ్బందిపడుతున్నాడు. అయితే మల్లేష్ ఫోన్ రావడంతో తనకు మంచి అవకాశం వచ్చిందని భావించాడు. తన వద్ద ఉన్న 2.48లక్షల రద్దైన కరెన్సీని తీసుకుని పంజగుట్టకు వచ్చి మల్లేష్ ను కలిశాడు.

మల్లేష్ ప్రశాంత్ ను తీసుకొని సోమాజీగూడలో పాన్ షాపు నిర్వాహకుడు అఫ్సర్ వద్దకు తీసుకెళ్ళాడు. అఫ్సర్ బాలకిషోర్ లతో పాటు పంజగుట్ట కానిస్టేబుళ్ళు ప్రవీణ్, సుబ్బరాజు , హోంగార్డు రామకృష్ణ పథకం ప్రకారం ఆ డబ్బును దొంగిలించారు. తాను మోసపోయాయని గ్రహించిన బాధితుడు ప్రశాంత్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

English summary
exchange currency effect on business man prashanth. mallesh belongs to m.s.makta.prashanth a businessman in vikarabad. mallesh, prashanth childhood friends.mallesh tell to prashanth i easy exchang banned currency. prashanth bring 2.24 lakhs of banned currency for exchange.mallesh, panshop owner afsar, constables subbaraju, praveen,homeguard ramakrishna were dheted prashanth. prashath complient agaist them in to panjagutta policestation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X