హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానంతో సిసిటీవీ కెమెరా అమర్చిన భార్య: బాలికతో అసహజ సెక్స్‌ చేస్తూ పట్టుబడిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆధారాలతో పట్టుకోవడానికి ఓ మహిళ సిసిటీవీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఆ సిసీటీవీ కెమెరాలో చిక్కిన తన భర్త కార్యకలాపాలు చూసి బిత్తరపోవడం ఆమె వంతైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి వెలుగు చూసింది.

శాలిబండలోని సున్నంబట్టీ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రంఖాన్ (46) ఇంట్లో ఓ కుటుంబం కొన్నాళ్లగా కిరాయికి ఉంటున్నది. ఆ కుటుంబంలోని నాలుగేళ్ల బాలికపై ఆరు నెలలుగా అక్రంఖాన్ అసహజ లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అక్రంఖాన్ తీరుపై అనుమానం తో భార్య ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది.

Businessman subjects minor girl to unnatural sexual abuse

సీసీ కెమెరాల్లో అక్రం ఖాన్ చిన్నారిపై లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొహమ్మద్ అక్రమ్ ఖాన్‌కు పెద్ద ఇల్లు ఉందని, దాంట్లో నాలుగు పోర్షన్లు చేసి వాటిని నాలుగు కుటుంబాలకు అద్దెకు ఇ్చచాడని సౌత్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ వి. సత్యనారాయణ చెప్పారు.

అనుమానం వచ్చి భార్య అక్రమ్ ఇంట్లో సిసిటివీ కెమెరా ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల తర్వాత టెక్నికల్ పర్సన్‌ను పిలిపించి వీడియోను ఓపెన్ చేయించింది. ఊహకు కూడా అందని విధంగా నాలుగేళ్ల బాలికపై అక్రమ్ అసహజమైన లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన దృశ్యాలను చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది.

English summary
A 46-year-old real estate businessman was arrested by Shalibanda police on Thursday night for allegedly indulging in unnatural sex with a four-year- old girl from last six months in Phoolbagh under Shalibanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X