బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్షలమంది పుడతారు, తెలుసుకోకుండా హిందుత్వశక్తులు అనడం సరికాదు: గౌరీ లంకేష్ హత్యపై పవన్ కళ్యాణ్

కన్నడ రచయిత్రి గౌరీ లంకేష్ హత్యపై ప్రముఖ తెలుగు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కన్నడ రచయిత్రి గౌరీ లంకేష్ హత్యపై ప్రముఖ తెలుగు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు.

చదవండి: నేనేం బంగారం కాదు, చంపేసే సహనం వద్దు, కొట్టమని అర్థమా: పవన్ కళ్యాణ్

తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. గౌరీ లంకేష్ హత్యను ఖండించారు. ఒక్క గౌరీని చంపితే మిలియన్ల కొద్ది పుట్టుకు వస్తారని పేర్కొన్నారు. అదే సమయంలో నిజాలు తెలుసుకోకుండా హిందుత్వ శక్తులపై ఆరోపణలు సరికాదన్నారు.

చదవండి: అప్పుడు మాట్లాడలేదే: సనాతన్ సంస్థ, గౌరీ లంకేష్ కాల్చివేతలో సోదరుడి కొత్త ట్విస్ట్

ఆపలేరు

చేతిలో పెన్ను కలిగి, సామాజిక నిబద్దత, సాంఘిక న్యాయం కోసం పోరాడుతున్న వారి భావవ్యక్తీకరణను ఆపలేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నుదుట బుల్లెట్ పేరుతో ట్వీట్ ప్రారంభించారు.

చంపడం సరికాదు

బహుళ నైతికతలు, బహుళ మతాలు, బహు భాషలు, బహు సంస్కృతులు, వివిధ ప్రాంతాలు కలిగిన గొప్ప భౌగోళిక వైవిధ్యం మరియు సాంస్కృతిక వైవిధ్యం కలిగిన మన దేశంలో రాజకీయ అభిప్రాయాలతో మనం విభేదించవచ్చునని, అడ్డుకోలేరని పవన్ పేర్కొన్నారు. విభేదాల కారణంగా హత్యలు సరికావని అభిప్రాయపడ్డారు. ఇలా చంపడం అంటే మన మహనీయుల స్ఫూర్తిని కూడా చంపుతున్నట్లే అన్నారు.

నిజాలు తెలుసుకోకుండా హిందుత్వ అనడం సరికాదు

గౌరీ లంకేష్ హత్యను ఖండించిన పవన్ కళ్యాణ్.. నిజానిజాలు తెలుసుకోకుండా హత్య వెనుక హిందుత్వ శక్తులు ఉన్నాయని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. లంకేష్ హత్య నేపథ్యంలో తన బాధను మాటల్లో చెప్పలేనన్నారు.

భావ స్వేచ్ఛను అడ్డుకోలేరు

భావ స్వేచ్ఛను అడ్డుకోలేరు

ప్రతి ఒక్కరి అభిప్రాయలను గౌరవించాలని, అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని చంపడం సరైనది కాదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో పెన్నుతో సామాజిక న్యాయం, నిబద్ధత కోసం మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నవ్యక్తి భావస్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

ఉనికి కోల్పోతున్నారు

గౌరీ లంకేష్ దారుణ హత్యకు కారకులైన నేరస్తులు ఎప్పటికైనా దొరకవచ్చు, శిక్షించబడవచ్చు. అదే సమయంలో వారు బలాన్ని, ఉనికిని క్రమంగా కోల్పోతున్నారనే విషయం తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

లక్షలాది మంది పుట్టుకు వస్తారు

లక్షలాది మంది పుట్టుకు వస్తారు

కన్నడ సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను దారుణంగా చంపి ఉండవచ్చునని, కానీ ఆ రక్తం నుంచి లక్షలాది మంది గౌరీలు పుట్టుకు వస్తారని చెప్పారు. గౌరీ లంకేష్ ఆత్మకు శాంతి కలగాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan on Thursday responded on Journalist Gauri Lankesh murder. He said by killing one Gauri Lankesh in a cold blooded manner is going to create a million Gauris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X