వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ అలా జాతీయ పార్టీని ప్రకటించిండో లేదో..ఇలా ఆర్జీవీ ఇచ్చి పడేసిండు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ఊహించినట్టే- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఈ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే తన స్థాయిని పెంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సారథిగా, రెండుసార్లు వరుసగా అధికారాన్ని అందుకున్న అనుభవం ఉందాయనకు. జాతీయ రాజకీయాల్లో ఎలా రాణించగలుగుతారనేది ఆసక్తి రేపుతోంది.

మునుగోడు బరిలో గద్దర్ - ఎవరూ ఊహించని పార్టీ నుంచి పోటీ..!!మునుగోడు బరిలో గద్దర్ - ఎవరూ ఊహించని పార్టీ నుంచి పోటీ..!!

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్పు చేస్తూ- పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించింది. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయాన్ని కేసీఆర్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి గల కారణాలను వివరించారు. దీని కోసం ప్రత్యేక అజెండాను రూపొందించుకున్నామని స్పష్టం చేసారు.

By Making TRS into BRS, KCR became the Adipurush, says Ram Gopal Varma

దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తోన్నాయంటూ ఇదివరకే ఆయన పలు సందర్భాల్లో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఎదిగే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను కలుపుకొనేలా కసరత్తు మొదలు పెట్టారు. కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్).. కేసీఆర్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

తమిళనాడుకు చెందిన కొన్ని పార్టీల నాయకులు కేసీఆర్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి జాతీయ స్థాయి ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌ను స్వాగతించే అవకాశం లేకపోలేదు. కాగా కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన వెంటనే- సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం పలికారు. ఆదిపురుష్‌గా సంబోధించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ ఆదిపురుష్‌ అయ్యారని వ్యాఖ్యానించారు.

English summary
Director Ram Gopal Varma welcome Telangana Chief Minister KCR into the National Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X