హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాలు మోదీ.. సంపకు మోదీ: హైదరాబాద్ లో బైబైమోదీ పోస్టర్లు; రచ్చ మామూలుగా లేదుగా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీక్స్ కు చేరుకుంది. బిజెపి సాలు దొర.. సెలవు దొర అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ, కల్వకుంట్ల కౌంట్ డౌన్ ప్రారంభిస్తే, టిఆర్ఎస్ రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. అయితే అదేమీ తమకు తెలియదన్నట్టు మోడీ వ్యతిరేక బ్యానర్లు, హోర్డింగ్స్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది.

సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ ఫ్లెక్సీలు

సాలు మోదీ.. సంపకు మోదీ అంటూ ఫ్లెక్సీలు

ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. సాలు మోదీ.. సంపకు మోదీ, బై బై మోదీ అంటూ పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన సక్సెస్ చేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్న వేళ, మోడీకి వ్యతిరేకంగా హైదరాబాద్ లో వెలిసిన హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు రెండు పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి అద్దం పడుతున్నాయి.

మోడీ వ్యతిరేక హోర్డింగ్స్, బ్యానర్ లలో మోడీ టార్గెట్ గా విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. #బై బై మోడీ అంటూ టివోలీ థియేటర్ ఎదురుగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫ్లెక్సీ లో రైతు చట్టాలు తెచ్చిన రైతులను చంపారు. నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టారు. హఠాత్తుగా లాక్ డౌన్ అని గరీబోళ్ల ని చంపావు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేశావు అంటూ మండిపడ్డారు.

 ఊహించని విధంగా మోడీ వ్యతిరేక ఉద్యమం ..

ఊహించని విధంగా మోడీ వ్యతిరేక ఉద్యమం ..

పెద్ద నోట్ల రద్దు పేరుతో సామాన్యుల నడ్డి విరిచారు. నల్లధనం వెనక్కి తెచ్చి వారి ఖాతాల్లో వేస్తానని 15 లక్షలు వేయకుండా మోసం చేసావు అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఎవరు ఏర్పాటు చేశారనే విషయం తెలియదు అని చెబుతున్నా, ఈ పని చేసింది టిఆర్ఎస్ పార్టీ నేనని బిజెపి నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోడీ పై సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రెండు హ్యాష్ ట్యాగ్ లు దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోడీ వ్యతిరేక హ్యాష్ ట్యాగ్స్

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోడీ వ్యతిరేక హ్యాష్ ట్యాగ్స్

రిజైన్ మోడీ, బై బై మోడీ, స్టెప్ డౌన్ మోడీ ఇలాంటి హ్యాష్ ట్యాగ్ లతో మోడీ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇవి జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, త్వరలో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయి అనేది వేచి చూడాలి.

English summary
saalu modi.. sampaku modi... Bye bye modi posters were unveiled in Hyderabad opposing PM Modi. The war against Modi started when the BJP was already targeting KCR with saalu dora.. selavu dora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X