• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎయిర్ హోస్టెస్‌‌పై లైంగికదాడి: నిందితుడి అరెస్ట్, పట్టిచ్చిన సీసీ కెమెరాలు

By Nageshwara Rao
|

హైదరాబాద్: శంషాబాద్‌లోని ప్రముఖ విమానయాన సంస్ధలో ఎయిర్ హోస్టెస్‌‌పై అత్యాచారయత్నానికి యత్నించిన క్యాబ్ డ్రైవర్ మీర్జా అహ్మద్ బేగ్ అలియాస్ ఇమ్రాన్‌ను బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్, ఎస్‌ఓటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

దారుణం: ఎయిర్ హోస్టెస్‌పై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారయత్నం

శంషాబాద్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టస్‌గా పనిచేస్తున్న యువతి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు రాజేంద్ర నగర్‌లో తాను నివాసముంటున్న హ్యాపీ హోమ్‌ అపార్ట్‌మెంట్ నుంచి మెడిసిన్స్ కోనేందుకు బయటకు వచ్చింది.

స్థానికంగా ఉన్న మెడికల్ షాపుకు వెళ్లగా దుకాణం మూసి ఉండటంతో మెట్రో పిల్లర్ నెం.216 వద్ద వేచి చూస్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ మీర్జా అహ్మద్ బేగ్ అలియాస్ ఇమ్రాన్ (25) యువతిని ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. దీంతో ఆమె మెడికల్ షాపుకు వెళ్ళాలని చెప్పి వాహనం ఎక్కింది.

Cab Driver Tries To Rape Airhostess, Arrested

ఈ క్రమంలో ఆమెను మెడికల్ షాపుకు తీసుకు వెళ్తానని చెప్పి నమ్మించిన ఇమ్రాన్.. ఆమెను మాటల్లో పెట్టి రూటు మార్చి శంషాబాద్, కిషన్‌గూడ ఓఆర్‌ఆర్ మీదుగా హిమాయత్‌సాగర్‌కు తీసుకు వెళ్లాడు. కారులో ముందు సీట్లో ఆమె కూర్చుని ఉండటంతో లైంగికదాడి చేయాలనే ఉద్దేశంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి షర్టును లాగాడు.

దుండగుడి చర్యలను పసిగట్టిన మహిళ అప్రమత్తమై ఆమె కేకలు పెట్టింది. వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని వెనకకు తోసి అత్యాచారంచేయ ప్రయత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇమ్రాన్ యువతిపై దాడి చేసి ఆమె సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఇంటికి చేర్చారు. నిందితుడిపై దోపిడీ, అత్యాచారం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఇమ్రాన్‌ను బుధవారం అరెస్టు చేశామని అన్నారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుడి వాహనాన్ని గుర్తించి ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The accused, identified as Mirza Ahmed Baig, a cab driver and a resident of Kishmathpura, misguided the airhostess, who wanted to buy some medicines at 2 PM near Dairy Farm Crossroads, and took her on the ORR Road with the intension of raping and robbing her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more