వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివేద‌న రోజే మంత్రి వ‌ర్గ భేటీ..!! కేసీఆర్ వ్యూహం అదేనా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ముందు కాబినెట్ సమావేశం

హైద‌రాబాద్: తెలంగాణ రాజ‌కీయాల్లో రోజూ సంచ‌ల‌నాలు జ‌రుగుతున్నాయి. ఊహ‌కంద‌ని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో., ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఎప్పుడు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు తెరుస్తారోన‌నే ఉత్కంఠ వ్య‌క్తం చేస్తున్నారు గులాబీ నేత‌లు. ఓప‌క్క శాస‌న స‌భ ర‌ద్దు, మ‌రో ప‌క్క ప్ర‌గ‌తి నివేద‌న‌లో ఏం చెబుతారు., ఇంకో ప‌క్క ముంద‌స్తు., అటుప‌క్క మంత్రివ‌ర్గ స‌మావేశం., లాంటి అంశాల‌తో తెలంగాణ వ్యాప్తాంగా వేడి వేడి రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంత‌కీ చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌తిష్టాత్మకంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేదన స‌భ‌కు కొద్ది నిమిషాల ముందు నిర్వ‌హిస్తున్న క్యాబినెట్ భేటీలో, ఆ త‌ర్వాత జ‌ర‌గ‌బోవు నివేద‌న స‌భ‌లో తెలంగాణ ప్ర‌జానికానికి ఏం చెప్ప‌బోతున్నారు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

నివేద‌న స‌భ‌కు కొద్ది క్ష‌ణాల‌ముదు క్యాబినెట్ భేటీ..! కేసీఆర్ వ్యూహం ఏంటి..?

నివేద‌న స‌భ‌కు కొద్ది క్ష‌ణాల‌ముదు క్యాబినెట్ భేటీ..! కేసీఆర్ వ్యూహం ఏంటి..?

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండ‌లి స‌మావేశం ఎప్పుడెప్పుడా అని జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు. పాతిక ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన రోజున హ‌డావుడిగా ఉండే వేళ స‌భ ప్రారంభం కావ‌టానికి మూడు గంట‌ల ముందు కేబినెట్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వాస్త‌వానికి ఇంత భారీ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ప్పుడు మంత్రులంద‌రికి ఒక్కో బాధ్య‌త అప్ప‌గించి వాటిని మానిట‌ర్ చేయించాల్సింది పోయి అందుకు భిన్నంగా మంత్రివ‌ర్గ భేటీ నిర్వ‌హించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మంత్రివ‌ర్గ భేటీ నిర్ణ‌యాలు లీక్ చేయొద్దు..! అందుకే స్ట్రిక్ట్ షెడ్యూల్..!

మంత్రివ‌ర్గ భేటీ నిర్ణ‌యాలు లీక్ చేయొద్దు..! అందుకే స్ట్రిక్ట్ షెడ్యూల్..!

స‌భ‌కు కొద్ది గంట‌ల ముందు కేబినెట్ భేటీ కావ‌టం, ముంద‌స్తు చ‌ర్చ జోరుగా వినిపిస్తున్న వేళ‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్రశేఖ‌ర్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌జ‌ల‌కు తానేం చెప్పాల‌నుకున్నారో, ఆ విష‌యాన్ని నేరుగా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌టం కేసీఆర్ కు అల‌వాటు. కానీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యం తీసుకున్నామ‌న్న భావ‌న‌ను క‌లిగించేందుకు వీలుగా మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ముందురోజు (శ‌నివారం) కేబినెట్ భేటీకి అవ‌కాశం ఉన్నా అందులో చ‌ర్చించిన అంశాలు మీడియాకి లీక్ అయితే ఇబ్బందవుతుంద‌న్న ఉద్దేశంతో షెడ్యూల్ ను మార్చిన‌ట్లుగా తెలుస్తోంది.

క్యాబినెట్ లోచ‌ర్చించిన అంశాలే స‌భ‌లో చెప్పాలి..! అందుకే కాన్ఫిడెన్షియ‌ల్ గా ఉండాలి..!

క్యాబినెట్ లోచ‌ర్చించిన అంశాలే స‌భ‌లో చెప్పాలి..! అందుకే కాన్ఫిడెన్షియ‌ల్ గా ఉండాలి..!

స‌భ ప్రారంభం కావ‌టానికి కాస్త ముందుగా భేటీ నిర్వ‌హించ‌టం ద్వారా అక్క‌డ చ‌ర్చించే అంశాలు అప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుండ‌దు. అదే స‌మ‌యంలో మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు చెప్పే మాట‌ల్ని స‌భ‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో కూడా పంచుకునే అవ‌కాశం ఉందంటున్నారు.
ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళ్లే నిర్ణయాన్ని కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇందులో నిజం లేద‌నే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల వ్య‌వ‌హారంకానీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే అంశం కానీ అసెంబ్లీ స‌మావేశాల్ని నిర్వ‌హించిన త‌ర్వాత, చివ‌రి రోజున కానీ ప్ర‌క‌టించే వీలుంటుంది. మ‌రి ఏ నిర్ణ‌యం తీసుకోన‌ప్పుడు కేబినెట్ మీటింగ్ ఎందుకు? అన్న‌ప్ర‌శ్న త‌లెత్త వ‌చ్చు. స‌భ నేప‌థ్యంలో ప్ర‌క‌టించే ప‌లు తాయిలాల‌కు సంబంధించి అధికారికంగా మంత్రివ‌ర్గ ఆమోదం ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. దీని కోస‌మే త‌ప్పించి మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప్ర‌త్యేక కార‌ణం ఏమీ లేద‌న్న భావ‌నను ప‌లువురు నాయ‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.

ముంద‌స్తు గురించి ప్ర‌క‌ట‌నా..? ప్ర‌జాభిప్ర‌యమా..? కేసీఆర్ ఏదైనా చేయొచ్చు..!

ముంద‌స్తు గురించి ప్ర‌క‌ట‌నా..? ప్ర‌జాభిప్ర‌యమా..? కేసీఆర్ ఏదైనా చేయొచ్చు..!

ఇదిలా ఉంటే సంచ‌ల‌న స‌భ నుంచి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలను ప్ర‌క‌టిస్తార‌ని ఒక‌వేళ స‌భ‌ను ర‌ద్దు చేసే అంశంతో పాటు ముంద‌స్తుకు వెళ్లే అంశాన్ని ప్ర‌క‌టించే వీలుంద‌న్న వాద‌న వినిపిస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంద‌స్తు అంశాన్ని అశేష ప్ర‌జానీకం ముందు వెల్ల‌డించి.. అనంత‌రం శాస‌న‌స‌భ ర‌ద్దు నిర్ణ‌యం ప్ర‌క‌టించే ప‌రిస్థితి ఉండ‌ద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే భారీ బ‌హిరంగ స‌భ ముందు మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లుగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న కొత్త ఊహాగానాల‌కు తెర తీస్తోంది.

English summary
telangana cm kcr is planning to go pre elections in telangana. for that purpose he wants know the public pulse and conducting huge public meeting on the name pragathi nivedhana sabha. before that meeting he planing to organise cabinet meeting which decisions only will discuss in nivedhan sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X