వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19న మంత్రివర్గ సమావేశం..! లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజల ప్రాణాల కన్నా ముఖ్యం ఏదీ కాదని గతంలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిశగా పకడ్బందీగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈనెల 20వ తారీఖున లాక్ డౌన్ ఆంక్షల సడలింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వాటి అమలు, సాధ్యాసాధ్యాలపై సమీక్షించనున్నారు చంద్రశేకర్ రావు. అందుకోసం ఈ నెల 19వ తారీఖున మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

 తెలంగాణ క్యాబినెట్ మరోసారి భేటి.. కేంద్రం విడుదల చేయనున్న మార్గదర్శాకాలపై చర్చ..

తెలంగాణ క్యాబినెట్ మరోసారి భేటి.. కేంద్రం విడుదల చేయనున్న మార్గదర్శాకాలపై చర్చ..

కాగా ఈ నెల 19న మద్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆంక్షల సడలింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై చర్చించి, మంత్రివర్గ భేటీలో చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 లాక్ డౌన్ పై కేసీఆర్ సీరియస్.. కొనసాగించాల్సిందే అంటున్న సీఎం..

లాక్ డౌన్ పై కేసీఆర్ సీరియస్.. కొనసాగించాల్సిందే అంటున్న సీఎం..

తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నప్పటికి కరోనా పాసిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళనకరంగా మారంది. ప్రజలందరూ స్వీయ నియంత్నణ పాటిస్తున్నప్పటికీ ఎందుకు కరోనా విజృంభిస్తోందో అంతుచిక్కకుండా తయారయ్యింది. ఒకే కుంటుంబంలో ఇద్దరు లేదా ముగ్గిరికి కరోనా సోకుతుండండంతో పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మురికి వాడలకు సానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు ప్రభుత్వ అదికారులు, ప్రజా ప్రతినిధులు శ్రమిస్తున్నారు. ఐనప్పటికి కేసుల సంఖ్య తగ్గక పోవడం పట్ల మరింత లోతుగా విశ్లేషించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 మినహాయిపులపై లోతైన చర్చ.. క్యాబినెట్ లో సీఎం కీలక నిర్ణయం..

మినహాయిపులపై లోతైన చర్చ.. క్యాబినెట్ లో సీఎం కీలక నిర్ణయం..

కరోనా మహమ్మారి తెలంగాణలో ప్రబలకుండా ఉండేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొదటి నుండీ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అనుకోకుండా తలెత్తిన విపత్తును అధిగమించేందుకు పకడ్బంధీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అంతే కాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తో సంప్రదింపులు జరుపుతూ లాక్ డౌన్ ఆంక్షలు, ప్రస్తుత తరుణంలో వ్యవహరించాల్సిన విధానాలు, కరోనా వ్యాది పరీక్షలు, నిర్ధారణ పరికరాలు, స్వీయ నియంత్రణ, పేద ప్రజలకు రాయితీలు అందించడం వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు.

 పెరుగుతున్న పాసిటీవ్ కేసులు.. రాష్ట్ర పరిస్థితులపై సీఎం సమీక్ష..

పెరుగుతున్న పాసిటీవ్ కేసులు.. రాష్ట్ర పరిస్థితులపై సీఎం సమీక్ష..

ఇదిలా ఉండగా ఈ నెల 20న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల విడుదల నేపథ్యంలో తెలంగాణ లో వాటి అమలు, వెసుబాటు తదితర అంశాలపై లోతుగా చర్చించాలని తెలంగాణ సర్కార్ కృతనిశ్యయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించడం ఒక్కటే సరైన చర్య అని సర్కార్ భావిస్తోంది. కొన్ని విభాగాలకు మినాహాయింపునిస్తే ప్రజలను నియంత్రించడం కష్టంగా మారుతుందని సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర మార్గదర్శకాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం స్వీయ నియంత్రణ పాటించడమే కాకుండా, మినహాయింపులు అంశంలో రాజీ పడేది లేదనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇవే అంశాలపై ఈనెల 20న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలపై ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది.

Recommended Video

Coronavirus : Goa Might Become Green Zone By Apr 17, Says CM Pramod Sawant

English summary
The State Cabinet meeting will be held at Pragati Bhavan, chaired by Chief Minister Chandrasekhar Rao. The conference is expected to discuss a wide range of measures to prevent coronal outbreaks, implementation of lockdowns, central government guidelines and easing sanctions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X