వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశ్నించే గొంతును ఎప్పుడు నొక్కలేరు..! టీఆర్ఎస్ వృధా ప్రయాస అన్న భట్టి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రశ్నించే గొంతును ఎప్పుడు నొక్కలేరు : భట్టి || Oneindia Telugu

బూర్గంపాడు/హైదరాబాద్ :ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో బాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోంది. కొత్తగూడెం భద్నచలం జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు ప్రజలు పెద్ద యెత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్బంగా యాత్రలో అన్నీ తానై నడిపిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎలాంటి దిగజారుడు రాజకాయాలకు పాల్పడుతున్నారని భట్టి ఘాటుగా విమర్శిస్తున్నారు.

 ప్రశ్నిస్తారనే ప్రతిపక్షంపై కుట్ర..! గులాబీ పార్టీ పై మండి పడ్డ సీఎల్పీ నేత..!!

ప్రశ్నిస్తారనే ప్రతిపక్షంపై కుట్ర..! గులాబీ పార్టీ పై మండి పడ్డ సీఎల్పీ నేత..!!

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో ప్రతిపక్షమే లేకుండా కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా కదలిరావాలన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు ప్రధాన కూడలిలో ప్రచార రథంపై నుంచి ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు.

అవినీతి కోసమే ప్రాజెక్టుల పునరాక్రుతి..! టీ సర్కార్ లంచాలమయంగా మారిందన్న భట్టి..!!

అవినీతి కోసమే ప్రాజెక్టుల పునరాక్రుతి..! టీ సర్కార్ లంచాలమయంగా మారిందన్న భట్టి..!!

రాష్ట్రంలో 32 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టులను పునరాకృతి పేరుతో లక్షా 25 వేల కోట్ల రపాయలకు పెంచి నిధులు దుబారా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన గత మూడు నెలల్లోనే ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీశామని, మరో ఐదేళ్లు తాముంటే అవినీతి లెక్కలు మొత్తం బయటపెడతామనే భయంతోనే ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో లోపాలతో ఇప్పటికే సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైఫల్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర తొలిరోజు అశ్వాపురం మీదుగా సుమారు 37 కి.మీ. కొనసాగి మణుగూరు పట్టణంలో ముగిసింది.

 ఉల్లంఘనలను ప్రజలకు వివరిస్తాం..! బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందన్న విక్రమార్క..!!

ఉల్లంఘనలను ప్రజలకు వివరిస్తాం..! బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందన్న విక్రమార్క..!!

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గులాబీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పార్టీలు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో గెలవాలని ఆయన సవాల్‌ విసిరారు. ఆదివారం ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభానికి ముందు భద్రాచలంలో రామాలయాన్ని దర్శించుకున్నారు.

ఇక ప్రభుత్వ విధాలనాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ముందుంలుంది..! స్పష్టం చేసిన భట్టి..!!

ఇక ప్రభుత్వ విధాలనాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ముందుంలుంది..! స్పష్టం చేసిన భట్టి..!!

అనంతరం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఓ వివాహ వేడుకకు వెళ్లినందున ఈ సమావేశంలో పాల్గొనలేదు. అసిఫాబాద్‌ వరకు యాత్ర చేస్తామని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న తీరుపై చైతన్యం కలిగిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన వాళ్లెవరూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో లేరని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

English summary
Chief Minister Chandrasekhar Rao, who came to power as water, funds, and appointments, has not fulfilled any assurance that he is being questioned by the Congress party, People should move to the conservation of democracy, batti said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X