• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హుజూర్ నగర్ లో ఆ నిర్ణయమే కాంగ్రెస్ ను ముంచిందా: బాధ్యులెవరు: కారుకు కలిసొచ్చిందవే..!

|
  Huzurnagar Bypoll 2019 : భారీ మెజారిటీ దిశగా TRS అభ్యర్ది సైదిరెడ్డి || Oneindia Telugu

  సిట్టింగ్ సీటు కాంగ్రెస్ కోల్పోతోంది. పీసీపీ చీఫ్ సొంత నియోజకవర్గాన్ని అధికార పార్టీ కైవసం చేసుకుంటోంది. హుజూర్ నగర్ లో ఇప్పటి వరకు వెల్లడవుతున్న ట్రెండ్స్ అధికార టీఆర్ యస్ కు భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 2018 ఎన్నికల్లో ఉత్తమ్ సాధించిన మెజార్టీ కంటే భారీ ఆధిక్యతంలో అధికార పార్టీ అభ్యర్ది సైదిరెడ్డి గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, సాధారణంగానే అంతర్గత కుమ్ములాటల్లో ముగినితేలుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ ఫలితానికి కారణమేంటనే చర్చ మొదలైంది.

  అసలు ప్రభుత్వం మీద ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్న వేళ.. ఈ విధంగా మెజార్టీ రావటమేంటనేది వారికి అంతు చిక్కని విషయంగా మారింది. అయితే..దీనికి ప్రధాన కారణంగా ఒక్కటే అంశం పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి పీసీసీ అధ్యక్షుడుతో పాటుగా పార్టీ హైకమాండ్ సైతం బాధ్యత వహించాల్సిదేనని పార్టీ నేతల అభిప్రాయం.

  అభ్యర్ధి ఎంపికలోనే తప్పటడుగు..

  అభ్యర్ధి ఎంపికలోనే తప్పటడుగు..

  కాంగ్రెస పార్టీ పట్టు ఉన్న మండలాల్లో సైతం హుజూర్ నగర్ లో వెనుకడి ఉండటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీ రౌండ్ లోనూ అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కసీనం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసారు. కానీ, అది తప్పింది. భారీ మెజార్టీ దిశగా సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. 8 వరౌండ్ ముగిసే సరికి 17,400 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ లో ఈ పరిస్థితికి కారణం ఏంటనే చర్చ మొదలైంది.

  ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణినే

  ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణినే

  అధికార పార్టీని కుటుంబ పార్టీ..కుటుంబ పాలన అని విమర్శిస్తూ..గత ఎన్నికల్లొ ఎమ్మెల్యేగా గెలిచి..పీసీసీ చీఫ్ గా ఉంటూ..ఎంపీగా గెలిచిప ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణినే అక్కడ అభ్యర్ధిగా ఖరారు చేయటమే తప్పటడుగుగా భావిస్తున్నారు. పద్మావతికి టిక్కెట్టు ఇవ్వదనే అభిప్రాయం ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే వ్యక్తి అయింది. అయినా కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్ధిగా ఉత్తమ్ సతీమణికి ఇవ్వటమే ఈ ఫలితానికి కారణంగా చెబుతున్నారు.

  నేరేడుచర్లలో 10 వేల మెజార్టీ..

  నేరేడుచర్లలో 10 వేల మెజార్టీ..

  ఇక, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలంగా పట్టు ఉన్న నియోజకర్గంలోని నేరేడుచర్ల మండలంలోనే అధికార పార్టీకి దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. మొత్తం 14 రౌండ్లు కౌంట్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 8 రౌండ్లు అధికారికంగా ప్రకటించారు. అధికారిక సమాచారం మేరకు ఇప్పటికే సైదిరెడ్డి 17,400 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఆయన దాదాపు 35 వేలకు పైగా మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, బీజేపీ..టీడీపీ నామమాత్రపు పోటీకి పరిమితమయినట్లుగా కనిపిస్తోంది.

  ఆర్టీసీ సమ్మె

  ఆర్టీసీ సమ్మె

  ఇక, పార్టీలోని నేతలను కలుపుకొని పోవటం..సమన్వయ లోపం కాంగ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మె అంశంలోనూ ఉత్తమ్ సరైన వ్యూహంతో ముందుకు వెళ్లలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తమ్ ను ఎంపీగా గెలిచి పంపగా..తిరిగి ఆయన సతీమణిని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరటానికి స్థానిక ప్రజలు అంగీకరించలేదని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఈ ట్రెండ్స్ మీద స్పందించటానికి ముందుకు రావటం లేదు.

  English summary
  TRS huge lead in Huzurnagar by poll with 17400 votes in 8 rounds counting. Congress leaders indirectly accepting their failure in by poll. First of all candidate finalisation is seem to be big mistake. TRS may get around 35000 majority at the end.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X