హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలలు నిండని శిశువుకు కేర్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పూర్తిగా నెలలు నిండకుండా పుట్టి.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కృత్రిమ శ్వాసనాళాలను ఏర్పాటు చేసి చిన్నారికి ఉపశమనం కలిగించారు.

ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను కేర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఎన్ విష్ణుస్వరూప్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన షరీఫ్ ఫాతిమా అనే మహిళ 33 వారాలలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది.

చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం శ్వాసనాళాల్లో సమస్యలున్నాయని గుర్తించారు.

ఏడు వేల మందిలో అరుదుగా ఒకరికి వచ్చే బైలాట్రల్ కోవనల్ ఆర్టీసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రహించామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు అరుదైన ఎండోస్కోపిక్ సర్జరీని నిర్వహించి కృత్తిమంగా శ్వాస నాళాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని విష్ణుస్వరూప్‌రెడ్డి అభినందించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

పూర్తిగా నెలలు నిండకుండా పుట్టి.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కృత్రిమ శ్వాసనాళాలను ఏర్పాటు చేసి చిన్నారికి ఉపశమనం కలిగించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

ఈ సర్జరీకి సంబంధించిన వివరాలను కేర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఎన్ విష్ణుస్వరూప్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

హైదరాబాద్ నగరానికి చెందిన షరీఫ్ ఫాతిమా అనే మహిళ 33 వారాలలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది.

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

కేర్ వైద్యుల అరుదైన చికిత్స

చిన్నారి పుట్టినప్పటినుంచి శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు తలెత్తాయి. దీంతో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు.

English summary
A four-weekold baby Shareef Fatima was given a new lease of life by ENT surgeons at Care Hospital, as she was saved from a life-threatening nasal disorder called Bilateral Congenital Bony Choanal Atresia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X