వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బాస్ 3 పై కేసు నమోదు..? అసలు గేమ్ నే నిషేదించాలంటున్న యాంకర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ​తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో బాగానే హిట్టయ్యింది. అదేంటో సడెన్ గా లైంగిక వేధింపుల వ్యవహారం ఇందులోనూ ఎంటరైంది, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ పై ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం శ్వేతారెడ్డి దీని గురించి తొలుత గొంతువిప్పారు. మా బాస్ ని ఎలా సంతృప్తి పరుస్తావు అని తనను అడిగినట్లు ఆమె ఆరోపించారు. తాజాగా ఆమె బంజారాహిల్స్ స్టేషనులో కేసు కూడా పెట్టారు. 'సెలక్షన్స్ కోసం వచ్చిన వారిని కమిట్‌మెంట్ ఇస్తారా?, బాస్‌ని ఎప్పుడు సంతృప్తి పరుస్తారు? మీరు బాడీ ఎప్పుడు తగ్గించుకుంటారు. వర్కవుట్స్ ఎప్పుటి నుంచి మొదలు పెడతారు? అని అడిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

బిగ్ బాస్ అనేది గేమ్ షో. దానికి నా షేపులకు ఏం సంబంధం అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ రియాలిటీ షోలో వారి పిలుపు మేరకు వెళ్లాను. ఎంపిక సమయంలోనే ఆ షో నిర్వాహకుల నుంచి నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ఆమె ఆరోపించారు. నిర్వాహకులు తనను 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావని అడిగారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 జులై 21 నుంచి ప్రారంభం కానుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించి షోను పాపులర్ చేశారు. మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తయింది.

Case against Bigg Boss3.! Anchor demands to ban the game..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్-3కి అగ్రహీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వెల్లడించనున్నారు. అయితే, ప్రముఖ తెలుగు యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. బిగ్ బాస్-3ని నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బంజారాహిల్స్‌ పీఎస్‌లో యాంకర్‌ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌-3లో సెలెక్ట్‌ చేసి అగ్రిమెంట్‌ ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.

బిగ్‌బాస్‌లో చేయాలంటే బాస్‌ని ఇంప్రెస్‌ చేయాలని, ఆర్గనైజర్స్‌ అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. ప్రోగ్రామ్‌ ఇన్‌ఛార్జ్‌ శ్యామ్‌, రఘు తనను మోసం చేశారని, తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శ్వేతారెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఇటీవలే శ్వేతారెడ్డి ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ ను వేశ్యాగృహంతో పోల్చిన సంగతి తెలిసిందే.

English summary
A case filed against BigBoss3 in the Banjara hills police station. Do managers run the Brothel House in pursuit of Big Boss? Anchor and journalist Shweta Reddy said. She alleged that casting couch was taking place in Bigbas. She said that the media was brave enough to immediately ban the show from Telugu TV and expose what was going on under the guise of Bigg Boss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X