హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు: నాన్నకు ప్రేమతో సినిమా డబ్బింగ్ ఇంచార్జీపై కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా డబ్బింగ్ ఇంచార్జీ బి. శ్రీనివాస్‌పై, ఎపి మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బివి సుబ్బారావుపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై వారి మీద ఆదివారం ఆ కేసు నమోదైంది.

అసోసియేషన్ అధ్యక్షుడిగా సుబ్బారావును తాను కొద్ది నెలల క్రితం వ్యతిరేకించానని, దాంతో గొడవ జరిగిందని 26 ఏళ్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ తన ఫిర్యాదులో తెలిపారు. దాంతో సంఘం నుంచి తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆమె చెప్పారు.

Case against ‘dubbing’ Srinivas for harassment women

గురువారంనాడు తాను నాన్నకు ప్రేమతో సినిమాకు డబ్బింగ్ చెబుతుండగా డబ్బింగ్ ఇంచార్జీ శ్రీనివాస్ అలియాస్ పప్పు తనపై, తన మహిళా సహోద్యోగులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపారు. శ్రీనివాస్‌తో సుబ్బారావు గొంతు కలిపాడని ఆమె ఆరోపించారు.

వారు మహిళలను మానసికంగా వేధిస్తున్నారని, దాంతో తాను గతంలో ఓసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నానని ఆమె చెప్పారు. ఈ ఫిర్యాదు కారణంగా సుబ్బారావు, శ్రీనివాస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Banjara Hills police on Sunday registered a case against dubbing incharge B. Srinivas of the Tollywood film Nannaku Prematho and AP Movie Dubbing Artist Association president B.V. Subba Rao, for allegedly harassing women dubbing artistes by making vulgar comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X