• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పైసలిస్తేనే పాస్ చేస్తాం!

|

హైదరాబాద్ : ఆయన ఓ యూనివర్సిటీ హెచ్ఓడీ. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఆయనది. అయితే డబ్బుల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకునేందుకు సిద్ధమయ్యాడు. పైసలిస్తేనే పాస్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తొలుత భయపడ్డ విద్యార్థులు ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ వేశారు. పక్కా ఆధారాలతో ఆ హెచ్ఓడీని ఏసీబీకి పట్టించారు. దీంతో సదరు గురువుగారు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నాడు.

62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు

ఏసీబీకి పట్టుబడ్డ ఉస్మానియో హెచ్ఓడీ

ఏసీబీకి పట్టుబడ్డ ఉస్మానియో హెచ్ఓడీ

విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బు సంపాదించాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ హెచ్ఓడీ భుక్యా బాలాజీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉంటుందని, ఫెయిల్ అవడం ఖాయమని విద్యార్థుల్ని భయపెట్టిన ఆయన ఎగ్జామ్‍‌లో పాస్ చేసేందుకు డబ్బు డిమాండ్ చేసేవాడు. స్టూడెంట్స్ ఫిర్యాదుతో ఈ నెల 4న ఏసీబీ అధికారులు బాలాజీ, అతకి సహకరించిన ఆర్ శ్రీనును అరెస్ట్ చేశారు. బాలాజీ ఆగడాలకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే వాట్సాప్ ద్వారా అందించాలంటూ ఓ మొబైల్ నెంబర్ విడుదల చేశారు.

వాట్సప్‌‍కు వీడియోలు పంపిన విద్యార్థులు

వాట్సప్‌‍కు వీడియోలు పంపిన విద్యార్థులు

ఏసీబీ వాట్సాప్ ప్రకటనపై పీజీతో పాటు యూజీ విద్యార్థులు స్పందించారు. భుక్యా బాలాజీ తమ వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్న వీడియోలను వాట్సప్‌లో ఏసీబీకి పంపారు. వాటి ఆధారంగా బాలాజీ నేరాన్ని నిర్థారించుకున్న ఏసీబీ అధికారులు అందుకు సహకరించిన కాలేజ్ జూనియర్ అసిస్టెంట్ ఖాజా అహ్మదుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే కటకటాలు లెక్కబెడుతున్న బాలాజీపై మరో కేసు బుక్ చేశారు.

రూ.10వేల నుంచి 20వేలు వసూలు

రూ.10వేల నుంచి 20వేలు వసూలు

ఎగ్జామ్స్‌లో ఫెయిల్ చేస్తానని భయపెట్టిన భుక్యా బాలాజీ ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.10 వేల నుంచి 20వేల వరకు వసూలు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇలా గతేడాది మేలో జరిగిన పరీక్షల్లో స్టూడెంట్స్ నుంచి రూ.1.60లక్షలు, ఈ ఏడాది మార్చి ఎగ్జామ్స్‌ సమయంలో రూ.1.50లక్షలు వసూలు చేశాడని అంటున్నారు. భుక్యా బాలాజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఫ్యాకల్టీ, ఇతర ఉద్యోగులు డబ్బు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Anti-Corruption Bureau (ACB) has registered a case of criminal misconduct against Head of Department (General Medicine), Osmania Medical College, Dr Bhukya Balaji and Junior Assistant Khaja Ahmeeduddin for allegedly collecting Rs 1.60 lakh in May 2018 and Rs 1.50 lakh in March 2019 as bribe from Post Graduate General Medicine students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more