హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై విమర్శల దుమారం: నటి శ్రీరెడ్డిపై కేసు, ప్రియాంక ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నటి శ్రీరెడ్డి పైన హైదరాబాద్‌లో కేసు నమోదయింది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను కించపరిచారని చెబుతూ పంజాగుట్ట కాలనీకి చెందిన శశాంక్ వంశీ మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

పవన్ కళ్యాణ్ కూడా కోర్టుకు వెళ్లొచ్చు కదా : శ్రీరెడ్డి కౌంటర్

ఆయన ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు శ్రీరెడ్డి పైన కేసు నమోదు చేశారు. సోమవారం శ్రీరెడ్డి జనసేనానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పవన్ కళ్యాణ్ కూడా కోర్టుకు వెళ్లొచ్చు కదా: సినీ నటి శ్రీరెడ్డి కౌంటర్పవన్ కళ్యాణ్ కూడా కోర్టుకు వెళ్లొచ్చు కదా: సినీ నటి శ్రీరెడ్డి కౌంటర్

పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల మీద దుమారం

పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల మీద దుమారం

కాగా, నటి శ్రీరెడ్డి ఇటీవల పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో, బయట శ్రీరెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనసేనానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని మండిపడుతున్నారు. నటి మాధవీలత దీక్షకే దిగారు.

పవన్ అభిమాని ప్రియాంక మరో ఫిర్యాదు

పవన్ అభిమాని ప్రియాంక మరో ఫిర్యాదు

మరోవైపు, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లోను శ్రీరెడ్డి పైన ఫిర్యాదులు అందాయి. పవన్ కళ్యాణ్ అభిమాని ప్రియాంక ఫిర్యాదు చేశారు. పవన్‌పై అనుచితంగా మాట్లాడారంటూ ఈ ఫిర్యాదు చేశారు.

 శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం

మరోవైపు, పవన్‌పైన శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఫిల్మ్ చాంబర్ ఎదుట మౌన దీక్షకు దిగిన నటి మాధవీలతను, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని నిరసనలు చేస్తున్నారంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మాధవీలత స్టేషన్‌లోనే మౌనదీక్షకు దిగారు. పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్లారని, అయినా తాను దీక్షను కొనసాగిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు

పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు

ఎవరు వచ్చినా, రాకున్నా తాను మాత్రం స్టేషన్‌లోనే దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. లవ్ ఇండియా, లవ్ మై లాంగ్వేజ్ అన్న నినాదాన్ని తన పోస్టుకు జోడించింది. అంతకుముందు ఫిల్మ్ చాంబర్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోందని భావించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లను పిలిపించారు.
మాధవీలతతో పాటు కూర్చున్న పవన్ కళ్యాణ్ అభిమానులను పోలీసులు తొలుత అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు.

English summary
A police complaint has been lodged against the news anchor turned actress Sri Reddy on her derogatory remarks on Pawan Kalyan at Punjagutta police station on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X