వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు: కోర్టుకు రేవంత్ ఇలా, సెబాస్టియన్‌కు సమన్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, రుద్ర ఉదయ్‌సింహ గురువారం ఉదయం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.

ఈ కేసులో మరో నిందితుడైన బిషప్‌ హ్యారీ సెబాస్టియన్‌ సమన్లు అందకపోవడంతో హాజరుకాలేదు. కోర్టుహాల్ నుంచి బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానం ఆదేశాల మేరకు హాజరయ్యామని తెలిపారు.

కోర్టుకు వస్తున్న రేవంత్

కోర్టుకు వస్తున్న రేవంత్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనుకూలంగా ఓటు వేయాలని ప్రలోభపెట్టారంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

కోర్టు ఆవరణలో రేవంత్

కోర్టు ఆవరణలో రేవంత్

కేసుపై దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ.. అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. దీన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు నిందితుల హాజరుకు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహలు కోర్టుకు హాజరయ్యారు.

ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసు

వీరి హాజరును నమోదు చేసుకున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ తదుపరి విచారణను అక్టోబరు 24వ తేదీకి వాయిదా వేశారు.

సెబాస్టియన్‌కు సమన్లు

సెబాస్టియన్‌కు సమన్లు

సెబాస్టియన్‌కు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్యపై హైకోర్టు కేసు కొట్టివేయగా, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాత్రపై అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉంది.

English summary
Telangana TDP MLA A Revanth Reddy and another accused in the cash-for-vote case appeared before an Anti-Corruption Bureau court here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X