వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు?: గవర్నర్‌తో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు, వచ్చిన ఏకే ఖాన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. ఇరువురి మధ్య రెండున్నర గంటలుగా చర్చలు సాగుతున్నాయి. సుదీర్ఘ మంతనాల పైన చర్చ జరుగుతోంది.

కేసీఆర్, గవర్నర్ నరసింహన్ భేటీ సమయంలోనే రాజ్ భవన్‌కు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, అడ్వోకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి కూడా వచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసు విషయమై వారి మధ్య చర్చ జరిగిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

'ఓటుకు నోటుపై రాజీ': ఏ1గా.. బాబుపై ఎఫ్ఐఆర్‌కు ఛాన్స్! ఏం జరిగింది?'ఓటుకు నోటుపై రాజీ': ఏ1గా.. బాబుపై ఎఫ్ఐఆర్‌కు ఛాన్స్! ఏం జరిగింది?

Cash for Vote affect: KCR meets governor Narasimhan

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ కేసుపై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంచలనం సృష్టించిన ఈ కేసుపై మళ్లీ చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసుపై కోర్టు ఉత్తర్వుల మీద ఏసీబీ అధికారులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao has met Governor Narasimhan on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X