వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు: విచారణలో 'నాయుడు' తడబడ్డారా? సాక్ష్యాలుగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తనయుడు డీకే శ్రీనివాస్ నాయుడిని మంగళవారం 6 గంటలపాటు విచారించిన ఏసీబీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించిందని సమాచారం.

రేవంత్‌తో ఉన్న సంబంధాలు, ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించి అధికారులు సంధించిన పలు ప్రశ్నలు సంధించింది. రేవంత్ రెడ్డితో శ్రీనివాస్ నాయుడు, అతడి సహాయకుడు విష్ణుచైతన్య పలుమార్లు మాట్లాడినట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు.

దీంతో, వీరిద్దర్ని విచారించేందుకు సిద్ధమైన నోటీసు ఇచ్చారు. శ్రీనివాస్ నాయుడు మంగళవారం పది గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని రాష్ట్ర ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదుగంటల వరకు సాగింది.

 శ్రీనివాస్ నాయుడు

శ్రీనివాస్ నాయుడు

ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఏమో, తెలియదు అని సమాధానమిచ్చినట్లుగా సమాచారం. కొన్ని ప్రశ్నలకు రేవంత్ రెడ్డి నాకు మంచి స్నేహితుడని, ఆయనతో ఫోన్‌లో మాట్లాడింది వాస్తవమేనని సమాధానమిచ్చారని తెలుస్తోంది.

 శ్రీనివాస్ నాయుడు

శ్రీనివాస్ నాయుడు

కేసుకు సంబంధించిన ప్రశ్నలకు ఏమీ తెలియదని, సంబంధం లేదని చెప్పారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు ఉదంతానికి ముందు మే 28, 29, 30 తేదీల్లో నిందితులతో 22 సార్లు మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయని ఎసిబి చెప్పిందని తెలుస్తోంది.

శ్రీనివాస్ నాయుడు

శ్రీనివాస్ నాయుడు

28వ తేదీకి ముందుగానీ, 30వ తేదీ తర్వాత గానీ మీరు వారితో మాట్లాడలేదనే అంశంపై ఏసీబీ సంధించిన ప్రశ్నలకు శ్రీనివాస్ నాయుడు తడబడినట్టుగా వార్తలొస్తున్నాయి. ఆ తర్వాత.. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆ తేదీల్లోనే నాతో ఆయన మాట్లాడారని, ఈ రోజు కూడా నేను మాట్లాడానని చెప్పారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో ఎసిబి టెలికం కంపెనీలను సాక్షులుగా చూపించనుందని తెలుస్తోంది. రేవంత్, ఇతరులు మాట్లాడారని చెప్పేందుకు ఇప్పటికే పలువురు టెలికం కంపెనీల రికార్డులు నమోదు చేశారని తెలుస్తోంది.

English summary
Adikesavulu Naidu's son Srinivas appear before the office of the ACB for interrogation on 18th Aug intensifying its probe in cash for vote scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X