వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కాలాక.. నేరేళ్ళ ఘటనలో ఎస్ఐ రవీందర్‌పై వేటు

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజన్నసిరిసిల్ల: నేరేళ్ళ ఘటనపై చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా ప్రభుత్వం తీరు ఉంది. ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ఈ అంశాన్ని ఉపయోగించుకొన్నాయి. అయితే డిఐజీ రవివర్మ నివేదిక ఆధారంగా ఎస్ఐ రవివర్మపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

కాంగ్రెస్ నేతలు టూరిస్ట్‌లు, డీఐజీతో నేరేళ్ళ ఘటనపై విచారణ: కెటిఆర్కాంగ్రెస్ నేతలు టూరిస్ట్‌లు, డీఐజీతో నేరేళ్ళ ఘటనపై విచారణ: కెటిఆర్

నేరేళ్ళలో ఇసుక లారీలను తగులబెట్టారనే కారణంగా ఈ ఘటనకు పాల్పడినవారిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు దళితులని కూడ చూడకుండా దాడులకు పాల్పడ్డారని పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

విపక్షాలు నేరేళ్ళ బాధితులను పరామర్శించి వచ్చిన తర్వాత చివరిసారిగా మంత్రి కెటిఆర్ వేములవాడలో ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

CCS SI Ravinder suspends for Nerella incident

ఈ ఘటనపై డిఐజీతో విచారణ జరిపిస్తామని కెటిఆర్ రెండు రోజుల క్రితం బాధితులను పరామర్శించిన తర్వాత ప్రకటించారు. మంత్రి హమీ మేరకు ఈ ఘటనపై డిఐజీ రవివర్మ విచారణ చేశారు.

ఈ ఘటనకు సిసిఎస్ ఎస్ఐ రవీందర్ అత్యుత్సాహమే కారణమని డిఐజీ నివేదిక ఇచ్చారు. రవీందర్ అతి ఉత్సాహన్ని చూపి విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేశారని నివేదికను ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా రవీందర్‌పై ఐజీ నాగిరెడ్డి చర్యలు తీసుకొన్నారు. రవీందర్‌ను సస్పెన్షన్ చేస్తున్నట్టు ఐజీ ప్రకటించారు.ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

English summary
IG Nagi reddy suspended ccs SI Ravinder as per DIG Ravi Varma report.DIG Ravi Varma submitted report on Nerella incident. As per this report IG Nagireddy suspended CCS SI Ravinder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X