వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16న సీఈసీ కౌంటింగ్ కేంద్రాల పరిశీలన..! ప్రతి సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్‌ల లెక్కింపన్న దానకిషోర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్లమెంట్ స్థానాల‌కు జ‌రిగే ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌ల‌ను లెక్కించ‌నున్నట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు పై స‌హాయ రిట‌ర్నింగ్ అధికారులు, త‌హ‌శీల్దార్‌లు, జీహెచ్ఎంసీ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. హైద‌రాబాద్ జిల్లా క‌లెక్టర్‌, హైద‌రాబాద్ పార్లమెంట్ స్థానం రిటర్నింగ్ అధికారి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కెన‌డిలు హాజ‌రైన ఈ స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ, హైద‌రాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల‌లో ఏర్పాట్లను వెంట‌నే ప్రారంభించాల‌ని తెలిపారు.

CEC verify counting centers on 16th.!DFO says Each segment has five rounds vvpatts counted.!

అంతే కాకుండా ఈ నెల 16వ తేదీన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రతినిధి బృందం హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌స్తున్నార‌ని తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది, అధికారుల‌కు 16వ తేదీన హ‌రిహ‌ర క‌ళాభ‌వ‌న్‌లో ప్రత్యేక స‌మావేశం ఏర్పాటు చేస్తున్నట్టు, 22వ తేదీన కౌంటింగ్ సిబ్బంది ర్యాండ‌మైజేష‌న్‌తో పాటు మ‌రో సారి శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కౌంటింగ్ సంద‌ర్భంగా నియ‌మ నిబంధ‌న‌ల‌ను క్షుణ్ణంగా అధ్యయ‌నం చేయాల‌ని, కౌంటింగ్ సంద‌ర్భంగా ఏర్పడే స‌మ‌స్యల‌ను, ప‌రిస్థితుల‌ను సంబంధిత అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారులే ప‌రిష్కరించేందుకు త‌గు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్పష్టం చేశారు.

English summary
District Election Officer and GHMC Commissioner M Dana kishore said that in each assembly segment, the number of votes will be counted in five vacation posts. A review meeting was held with assistant returning officers, tahsildars and GHMC officials on counting of votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X