వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములోరి తిరుకల్యాణ ఉత్సవాలు .. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నేడు ఎదురుకోలు ఉత్సవం

|
Google Oneindia TeluguNews

రేపు జరుగనున్న రాములోరి కల్యాణానికి భద్రాద్రి శోభాయమానంగా ముస్తాబైంది .ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం జరుగనున్న నేపధ్యంలో రాములవారు నడయాడిన రమణీయ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

<strong>భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలు</strong>భద్రాద్రి సీతారామస్వామి తిరు కల్యాణోత్సవాలు... కనువిందుగా గరుడాధివాసం పూజలు

ఘనంగా ధ్వజారోహణం ..

ఘనంగా ధ్వజారోహణం ..

స్వామి వారి తిరు కళ్యాణోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన ధ్వజపటలేఖన కార్యక్రమం ఘనంగా జరిగింది .భద్రాద్రి సీతారామ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం గరుడాధివాసం పూజలు నిర్వహించారు. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణోత్సవాల్లో శుక్రవారం భద్రాచలంలో నిర్వహించిన ధ్వజారోహణం కనులపండుగగా సాగింది. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన గరుత్మంతుడి పటాన్ని ఈ సందర్భంగా ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఇప్పటి నుంచి పూర్ణిమ నాటి వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవులకే తెలిపేలా ఈ ధ్వజారోహణ నిర్వహించారు.

 భేరీపూజ .. నేడు ఎదుర్కోలు వేడుక

భేరీపూజ .. నేడు ఎదుర్కోలు వేడుక

అలాగే అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే భేరీపూజ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణాన్ని పురస్కరించుకొని అందజేసే ప్రసాదంతో సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో అధిక సంఖ్యలో మహిళలు ప్రసాదాన్ని స్వీకరించారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి.నేడు భద్రాద్రిలో స్వామివారి ఎదురుకోలు వేడుక ఘనంగా జరగనుంది.

మిథిలా స్టేడియంలో ఘనంగా కళ్యాణానికి ఏర్పాట్లు

మిథిలా స్టేడియంలో ఘనంగా కళ్యాణానికి ఏర్పాట్లు

ఆదివారం భద్రాద్రి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నవమిని పురస్కరించుకొని భద్రాద్రి సర్వాలంకారాలతో కాంతులీనుతుంది .. 14న జరిగే శ్రీరామ మహా పట్టాభిషేకానికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరు కానున్నారు.

కళ్యాణానికి ఏర్పాట్లు చేసిన అధికారులు

కళ్యాణానికి ఏర్పాట్లు చేసిన అధికారులు

కళ్యాణోత్సవానికి వచ్చే అశేష భక్త జనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు . చలువపందిళ్ళు వేశారు . మౌలిక వసతులను కల్పించారు నవమి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ 1800 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసింది.

English summary
Brahmotsavam of sri Seetharama Swamy temple bhadrachalam decorated colourflly for SeethaRama swamy kalyanam .Amid rituals and chanting of veda mantras by the temple priests, Adhi puja .The priests performed dhwajarohanam on 12th and today they are performing the edurukolu uthsav , and the importanat phase of the utsavam The Kalyanam will be performed tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X