వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న‌లుగురికి చెప్పాల్సిన పెద్ద‌లు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీన‌మ్మా జీవితం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్‌ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వారి బతుకుల్లో పూడ్చలేని లోటేర్పడుతుంది. అధికారులైనా, ఉద్యోగులైనా, ప్రముఖులైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా సరే, సమాజంలో ఉన్న హోదా, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుంది. అందరికీ సంతోషమనే విషయాన్ని గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే శ్రేయ‌స్క‌రంగా ఉంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 పరువు తీస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌..! అడ్డంగా బుక్కవుతున్న అదికారులు, సెల‌బ్రిటీలు..!!

పరువు తీస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌..! అడ్డంగా బుక్కవుతున్న అదికారులు, సెల‌బ్రిటీలు..!!

మద్యం మత్తులో ప్రమాదాలు..! మద్యం తాగి వాహనాలు నడుపుతున్న సెలబ్రిటీలు..! తాగిన మైకంలో పోలీసులతో దురుసు ప్రవర్తన, ఇలాంటి వార్తలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. అందరినీ నచ్చజెప్పి వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహించి ఓపికగా పోలీసులు సక్రమ మార్గం చూపుతుంటారు. కానీ నగరంలో చోటు చేసుకుంటున్న ఒకటి రెండు ఘటనలు పాఠాలు చెప్పే పోలీసు శాఖనే ప్రశ్నించేలా ఉన్నాయి. వాస్తవానికి మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం.. నేరం అనే విషయం వారికి తెలియంది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు నిబంధనలను పక్కన పెట్టడంతో ఆయా అధికారులు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మద్యం మహమ్మారి సాధారణ వ్యక్తులనే కాదు.. చట్టం గురించి తెలిసిన వారిని సైతం బోల్తా కొట్టిస్తుందనడానికి నగరంలో చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనం.

 తాగి నడపడం కన్నా హోదా గొప్ప‌ది..! విజ్ఞ‌త కోత్పోతున్న‌పెద్ద‌మ‌నుషులు..!!

తాగి నడపడం కన్నా హోదా గొప్ప‌ది..! విజ్ఞ‌త కోత్పోతున్న‌పెద్ద‌మ‌నుషులు..!!

గత ఏడాది జనవరి 29న ఓ ఇన్‌స్పెక్టర్‌ తాగిన మైకంలో వాహనం నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడు. గతంలో జవహర్‌నగర్‌ పీఎస్ లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయన అదే పీఎస్‌ పరిధిలోని యాప్రాల్‌ ప్రాంతంలో మద్యం తాగి వాహనం నడపడంతో కారు ప్రమాదానికి గురై ఇద్దరు గాయాల పాలయ్యారు. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఉన్నతాధికారులు సదరు అధికారిని అప్పట్లో సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకున్నారు.అదేవిధంగా శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో కారు నడిపిన సౌత్‌జోన్‌కు చెందిన ఓ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. తన ముందున్న కారును ఢీకొట్టడంతో ఆ కారు ధ్వంసమయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సదరు అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?

 తాగి వాహ‌నం న‌డుపుతున్న పోలీసులు..! అల‌స‌త్వం వ‌హిస్తున్న పై అదికారులు..!!

తాగి వాహ‌నం న‌డుపుతున్న పోలీసులు..! అల‌స‌త్వం వ‌హిస్తున్న పై అదికారులు..!!

తాగి వాహనం నడిపి ప్రమాదాలు జరగడంతో వెలుగులోకి వచ్చిన ఘటనలతో పాటు పోలీసులు నిర్వహించే డ్రంకెన్‌డ్రైవ్‌లలో అను నిత్యం ఎంతో మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాగి వాహనం నడిపి పోలీసులకు చిక్కిన వారికి కౌన్సెలింగ్‌లు, పాఠాలు సాధారణమే. అయితే పాఠాలు చెప్పాల్సిన అధికారుల్లో ఒకరిద్దరు అదే తప్పు చేయడం ఇటు వారు పని చేసే శాఖలో, ఎంతో గౌరవం సంపాదించుకున్న సమాజంలో చులకన అవుతున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాల్లో వ్యక్తిగతంగా నష్టపోవడమే కాకుండా ఇతరులకూ ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.అలాంటి పాఠాలు బోధించే కొందరు అధికారులే అన్నీ తెలిసి డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయడం బాధాకరం.

 కాస్త ఆలోచించండి.! రోల్ మోడ‌ల్ గా ఉండాల్సివాళ్లే త‌ప్పుచేయడం బాదాక‌రం..!!

కాస్త ఆలోచించండి.! రోల్ మోడ‌ల్ గా ఉండాల్సివాళ్లే త‌ప్పుచేయడం బాదాక‌రం..!!

అధికారులైనా, ఉద్యోగులైనా, ప్రముఖులైనా, సెలబ్రిటీలైనా ఎవరున్నా సరే రోడ్డు మీద వాహనం డ్రైవ్‌ చేసుకుంటూ వెళితే తప్పని సరిగా రోడ్డు నిబంధనలు పాటించాల్సిందే. రూల్స్‌కు ఎవరూ అతీతం కాదు. అందునా మద్యం సేవించి వాహనం నడపడమనేది పెద్ద నేరమే. దీనికి ప్రధాన కారణం సొంతనష్టమే కాకుండా ఇతరులకూ ప్రమాదకర పరిస్థితిలో నెట్టేస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌లో ఎవరికీ మినహాయింపు లేదు. అధికారులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే ఎంతో కష్టపడి శ్రమ, ప్రతిభతో పాటు ఎన్నో త్యాగాలు చేసి ఓ స్థానాన్ని పొందుతున్నారు. ఓ గుర్తింపు పొందిన తర్వాత అందరూ ఆ గౌరవాన్ని కాపాడుకోడానికి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలవాట్లు, అవసరాలు అనేది వేరు. కానీ సమాజంలో ఉన్న హోదా, గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకుంటే ప్రజల్లో మరింత ఆద‌ర‌ణ పెరుగుతుంది.

English summary
Drinking alcohol is not only a deterrent but a bit of life. Those who are dependent on the victims are not the only ones who are in despair, but their life is inconvenient in their lives. Whether you are employed, celebrated, the people will be more respected if they are in a position to respect the status and honor of society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X