వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లోరైడ్ రక్కసిపై తెలంగాణ గెలుపు - కేంద్రం ప్రకటన - టీమ్ ఎంబీకి కేటీఆర్ కితాబు - ఏపీలో ఇంకా 111

|
Google Oneindia TeluguNews

ఫ్లోరైడ్.. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న పెద్ద సమస్యల్లో ఒకటి. దానికి పరిష్కారం చాలా చిన్నదే అయినా అధిగమించడానికి ఇన్నేళ్లు పట్టింది. ఫ్లోరైడ్ పేరు చెప్పగానే ఠక్కుగ గుర్తొచ్చేది ఉమ్మడి నల్గొండ జిల్లా. పక్కనే కృష్ణానది పారుతున్నా.. ఆ నీటిని గ్రామలకు తరలించే దిశగా గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో ఏళ్లపాటు ఫ్లోరైడ్ రక్కసి వేల మందిని కాటేసింది. ఎట్టకేలకు సొంత రాష్ట్రంలోనైనా ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..

ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలుఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - షోపియాన్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధం - జవాన్లపై చర్యలు

కేంద్రం కీలక ప్రకటన..

కేంద్రం కీలక ప్రకటన..


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాలకు సంబంధించి లిఖితపూర్వక సమాధానం చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు కీలక నివేదికను వెలువరించింది. తెలంగాణ‌లో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవ‌ని కేంద్ర‌మే స్ప‌ష్టం చేసింది. కేంద్రం నివేదికపై తెలంగాణ అంతటా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్. రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. ఇక్కడి పల్లెల్ని ఫ్లోరైడ్ ప‌ట్టిపీడించిన వైనం, స‌మ‌స్య విముక్తి కోసం చేసిన పోరాటాలు, దేశ రాజధాని ఢిల్లీ వేదికగానూ జరిపిన నిరసనలు.. ఎట్టకేలకు ఫ్లోరైడ్ పై విజయం.. వీటన్నింటినీ జనం మననం చేసుకుంటున్నారు.

మోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలుమోదీ, దోవల్ సెక్యూరిటీ డేటా చోరి? - ఎన్ఐసీ కంప్యూటర్లపై సైబర్ దాడి - దర్యాప్తులో సంచలన అంశాలు

కేటీఆర్ ట్వీట్ వైరల్..

కేటీఆర్ ట్వీట్ వైరల్..


ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సంబంధించి కేంద్రం వెలువరించిన నివేదికపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘‘రాష్ర్ట ఆవిర్భావానికి ముందు తెలంగాణ‌లో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవి. మిష‌న్ భ‌గీర‌థ‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డంతో.. ఇవాళ రాష్ర్టంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవు. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవ‌ని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది. మిష‌న్ భ‌గీర‌థ బృందానికి నా అభినంద‌న‌లు'' అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎలా సాధ్యమైందంటే..

ఎలా సాధ్యమైందంటే..


ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక ‘మిష‌న్ భ‌గీర‌థ' ప‌థ‌కం వ‌ల్లే తెలంగాణ ఇప్పడు ఫ్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా ఆవిర్భ‌వించిందని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ (మిష‌న్ భ‌గీర‌థ‌) మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మిష‌న్ భ‌గీర‌థ అమ‌లుతో తెలంగాణ ప్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన‌ట్లుగా ట్వీట్ చేసిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్టంలో 967 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుండేవని, 30 ఏళ్ళ కింద‌ట, సింగూరు జలాల‌ను సిద్దిపేట‌కు అందించిన అనుభ‌వంతో, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను రూపొందించారని, మిష‌న్ భ‌గీర‌థ ద్వారా గోదావ‌రి, కృష్ణా జ‌లాల‌ను ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు అందించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి అన్నారు.

Recommended Video

BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu
ఏపీలో ఇంకా 111 గ్రామాల్లో..

ఏపీలో ఇంకా 111 గ్రామాల్లో..

ఫ్లోరోసిస్ సమస్యకు సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణను ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రంగా పేర్కొంది. 2015 నాటికి రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967కాగా, ఇప్పుడా సమస్య పూర్తిగా తొలిగిపోయిందని తెలిపింది. తెలంగాణతోపాటు గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కూడా ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రాలుగా కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్ లో అత్యధికంగా 3,095 గ్రామాలు ఫ్లోరైడ్ సమస్యతో సతమతం అవుతున్నట్లు పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. 2015లో ఏపీలో 402 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుండగా.. ప్రస్తుతం 111 గ్రామాల్లో ఇంకా సమస్య కొనసాగుతున్నదని నివేదికలో పేర్కొన్నారు.

English summary
Telangana state has emerged as a fluoride-free state with zero affected areas along with the Gujarat and Uttarakhand. The number of fluoride affected areas in Telangana during 2015 was 967 but the number has come down to zero with the successful implementation of Mission Bhagiratha programme launched by the state government. Announcing it on his Twitter handle, the state minister KT Rama Rao said that there are zero fluoride affected areas in Telangana according to an official statement in parliament by Government of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X