• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం షాక్; మిషన్ భగీరథ అవినీతిపై విచారణ; టార్గెట్ కేసీఆర్!!

|
Google Oneindia TeluguNews

అవినీతిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అంటూ ఇటీవల పర్యటనలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు, ప్రాజెక్టుల నిర్మాణంలో, మిషన్ భగీరథలో అడుగడుగున అవినీతికి పాల్పడ్డారని చేసిన విమర్శలతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై కేంద్రం ఫోకస్ చేస్తుందా అన్న అనుమానం అందరిలో వ్యక్తమైంది. ఇక ఆ అనుమానాన్ని నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిజంగానే తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది.

 మిషన్ భగీరధపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన కేంద్రం

మిషన్ భగీరధపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన కేంద్రం

కాంగ్రెస్ పార్టీ నేత బక్క జడ్సన్ మిషన్ భగీరథ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని ఫిర్యాదు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణా ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని కోరారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. జల జీవన్ కమిషన్ సర్వే ఆధారంగా మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణంపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు దర్యాప్తు అధికారిని కూడా నియమించింది.

జల జీవన్ కమిషన్ పథకం అమలు తీరుపై సర్వే

జల జీవన్ కమిషన్ పథకం అమలు తీరుపై సర్వే

మిషన్ భగీరథ పథకానికి ఏడు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం 36వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత త్రాగు నీరు ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే జల జీవన్ కమిషన్ పథకం అమలు తీరుపై సర్వే నిర్వహించింది. ఈ కమిషన్ మిషన్ భగీర పై సర్వే చేసి రిపోర్టును కేంద్రానికి అందజేసింది. ఇక ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నేత కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

మిషన్ భగీరధలో అవినీతి . ప్రతిపక్షాల ఆరోపణలు

మిషన్ భగీరధలో అవినీతి . ప్రతిపక్షాల ఆరోపణలు

మిషన్ భగీరథ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని, సగానికిపైగా పాత పైపులు, పాత ట్యాంకులు, నల్లాలు, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మిషన్ భగీరథ స్కీమ్లో వాడుకుని కొత్తవి వేసినట్టుగా బిల్లులు పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మిషన్ భగీరథ పైపులు ఇచ్చిన కంపెనీలు, కెసిఆర్ కుటుంబ సభ్యులవేనని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వచ్చాయి. మిషన్ భగీరథ పథకం అమలు కోసం హడ్కో, కమర్షియల్ బ్యాంకులో నుంచి 80 శాతం నిధులు అప్పుగా మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి నిధులు కేటాయించింది.

మిషన్ భగీరధ అవినీతిపై కేంద్రం విచారణ.. తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి వ్యూహం

మిషన్ భగీరధ అవినీతిపై కేంద్రం విచారణ.. తెలంగాణా సర్కార్ పై ఒత్తిడి వ్యూహం

ఇక మిషన్ భగీరథ కు కేటాయించిన నిధులలో గోల్మాల్ జరిగిందన్న దానిపై విచారణ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి ఒకింత షాక్ అనే చెప్పాలి. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకొని లోతుగా దర్యాప్తు చేస్తుందా? లేక ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేయడానికి ఆడుతున్న మైండ్ గేమ్ నా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్టు సాగుతున్న పొలిటికల్ వార్ లో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది.

 టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఎవరు సక్సెస్ అవుతారో ?

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఎవరు సక్సెస్ అవుతారో ?

ఏది ఏమైనా ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా నేతలు అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో పాటుగా, కేంద్రంలోని అగ్రనేతలను రంగంలోకి దింపి ఇప్పటినుండే వచ్చే ఎన్నికల రాజకీయాలతో సెగలు పుట్టిస్తున్నారు. మరి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్న ఈ పోరాటంలో వచ్చే ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి కెసీఆర్ పై ఒత్తిడి పెంచుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పోరులో ఎవరు ఏ మేరకు సక్సెస్ అవుతారో భవిష్యత్తులో తెలియనుంది.

English summary
The Center has given a shock to the Telangana government. Based on the survey report given by the Jalajivan Commission, the Center has appointed an inquiry officer to probe Mission Bhagiratha's corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X