• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీకాల అంశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.!రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామన్న ఉత్తమ్.!

|

హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనో అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గురువారం నాడు జూమ్ యాప్ లో ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జీ మనిక్కమ్ ఠాగూర్ లు మాట్లాడుతూ దేశంలో కరోనో విజృంభిస్తున్న సమయంలో బీజేపీ ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్లక్షంగా వ్యవహరించిందని, దేశంలో ప్రజలకు టీకాలు వేయకుండా మన అవసరాలు తీర్చకుండా విదేశాలకు టీకాలు ఎగుమతి చేసారని ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడిలో విఫలం చెందిందని నేతలు మండిపడ్డారు.

కాంగ్రెస్ కార్యాచరణ.. 4న దేశ వ్యాప్తంగా వినతి పత్రాల సమర్పణ.. 7న రాష్ట్ర వ్యవతంగా సత్యాగ్రహాలు..

కాంగ్రెస్ కార్యాచరణ.. 4న దేశ వ్యాప్తంగా వినతి పత్రాల సమర్పణ.. 7న రాష్ట్ర వ్యవతంగా సత్యాగ్రహాలు..


కరోనా కట్టడి చేయాలంటే పూర్తిస్థాయిలో టీకాలు వేయడం ఒక్కటే మార్గమని అందుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయాలని, రోజుకు కోటి మందికి టీకాలు వేసి యుద్ధ ప్రాతిపదికన టీకాలు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుందని వారు అన్నారు. ఇందుకోసం 4వ తేదీన దేశ వ్యాప్తంగా రాష్టపతి పేరున వినతి పత్రాలు ఇవ్వనున్నామని, హైదరాబాద్ లో గవర్నర్ కు, జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పించాలని వారు అన్నారు. దేశంలో ఇప్పటి వరకు 2 డోసుల వాక్సిన్ కేవలం 4 శాతం మందికి మాత్రమే ఇచ్చారని 18 ఏళ్ల పై పడిన వారికి అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ అని వారు అన్నారు.

బాదితుల నుండి అడ్డగోలుగా వసూలు చేసిన ఆసుపత్రులు.. ప్రభుత్వం డబ్బులు వెనక్కు ఇప్పించాలన్న కాంగ్రెస్..

బాదితుల నుండి అడ్డగోలుగా వసూలు చేసిన ఆసుపత్రులు.. ప్రభుత్వం డబ్బులు వెనక్కు ఇప్పించాలన్న కాంగ్రెస్..


అలాగే 7వ తేదీన హైదరాబాద్ గాంధీ భవన్ లోను జిల్లా కేంద్రాలల్లోనూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నాయని రోగులకు వైద్యం చేయడానికి ఆసుపత్రులు లక్షలాది రూపాయల వసూలు చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలని అలాగే హైకోర్టు తీర్పు మేరకు ఇప్పటి వరకు అడ్డగోలుగా వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులు రోగులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ తో సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఉచితంగా ఇవ్వాల్సిన మందులను కేటీఆర్ అమ్ముకుంటున్నాడు.. సంచలన ఆరోపణ చేసిన రేవంత్

ఉచితంగా ఇవ్వాల్సిన మందులను కేటీఆర్ అమ్ముకుంటున్నాడు.. సంచలన ఆరోపణ చేసిన రేవంత్


ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరికీ సమానంగా మందులు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉండగా మంత్రి కేటీఆర్ తన వద్ద ఇంజెక్షన్లు, మందులు స్టాక్ పెట్టుకొని తన ట్విట్టర్ లో అడిగిన వారికి సహాయం చేస్తున్నట్టు ప్రచారం చేసుకొని అమ్ముకుంటున్నారని ఇది నేరమని దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఎమ్యెల్సి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనో నివారణ విషయంలో పూర్తిగా విఫలం అయ్యిందని ప్రజలను ప్రైవేట్ మెడికల్ మాఫియా దోచుకుంటుందని దీనిపై కాంగ్రెస్ ఉద్యమం చేయాలని అన్నారు. ఇంకా సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కారుదర్శులు, డీసీసీ అధ్యక్షులు మాట్లాడారు.

  TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
  కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు.. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన భట్టి..

  కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు.. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన భట్టి..


  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కరోనో నియంత్రణలో విఫలం అయ్యిందని తాము మొదటి నుంచి కరోనో ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒప్పుకొని కూడా అమలు చేయలేదని రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ మాఫియా దోచుకుంటున్న ప్రభుత్వం పట్టనట్టు ఉందని విమర్శించారు. ప్రయివేటు ఆసుపత్రుల దోపీడీతో అనేక మంది పేద మద్యతరగతి ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.

  English summary
  Congress leaders criticized the BJP government at the center and the TRS government in the state for completely failing to curb coronation. A meeting of key leaders and DCC presidents was held on the Zoom app on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X