వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివక్షతో కాదు విచక్షణతో.. సీఎం కేసీఆర్ కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..

|
Google Oneindia TeluguNews

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షతో విచక్షణతో వ్యవహరిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై వేయడం భావ్యం కాదన్నారు.

ఆ శ్రద్ద కరోనా నివారణపై ఉంటే బాగుండేది..

ఆ శ్రద్ద కరోనా నివారణపై ఉంటే బాగుండేది..

సచివాలయం కూల్చివేతపై పెట్టిన కేర్.. కరోనా వైరస్ నివారణపై పెడితే బాగుండేదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకోసమే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా వైరస్ తొలినాళ్లలో పారాసిటమాల్‌తో వైరస్ పోతుందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.

500 వెంటిలేటర్ల సీల్ తీయలేదు..

500 వెంటిలేటర్ల సీల్ తీయలేదు..


కరోనా వైరస్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం తక్కువ చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1400 వెంటిలేటర్లు ఇచ్చామని.. కానీ 500 వెంటిలేటర్ల ఓపెన్ చేయలేదని తెలిపారు. ఇచ్చిన వనరులను ఎందుకు సద్వినియోగం చేసుకోరు అని ప్రశ్నించారు. 13.85 లక్షల ఎన్-95 కిట్లు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలను తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. కానీ ఏమీ ఇవ్వలేదు అని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

పనికొచ్చే ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చలే..?

పనికొచ్చే ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చలే..?


మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఉచిత బియ్యం, ఉపాధి హామీ పనిదినాల పెంపు, 52 లక్షల మహిళల జన్ దన్ ఖాతాల్లో నగదు జమ, రైతు సమ్మాన్ నిధి కింద 32 లక్షల మంది ఖాతాల్లో రూ.666 కోట్ల ఖర్చుచేశామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. కానీ కేసీఆర్ మాత్రం పనికిరాని పథకం అని అంటున్నారని పేర్కొన్నారు. అయితే పనికొచ్చే ఆరోగ్య శ్రీలో కరోనా వైరస్‌కు ఎందుకు చికిత్స అందించడం లేదు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Recommended Video

#Congress : Sonia Gandhi కీలక ఆదేశాలు.. పార్టీ లో భారీ మార్పులు! || Oneindia Telugu
ఉచిత విద్యుత్‌కు అడ్డంకి కాదు..

ఉచిత విద్యుత్‌కు అడ్డంకి కాదు..


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విద్యుత్ చట్టంతో రైతులకు నష్టం ఉండదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం అనే అంశం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ కిందకు వస్తుందని.. ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు అని తెలిపారు. కానీ విద్యుత్ చట్టంతో ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదు అని.. అన్నీ కేంద్రం కంట్రోల్‌లో ఉంటుందని కేసీఆర్ పదే పదే చెబుతోన్న సంగతి తెలిసిందే.

English summary
central government on telangana not Discrimination.. Discretion central minister kishan reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X