వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా సినీ నిర్మాణాలకు పర్మిషన్..? సినీ ప్రముఖులతో కిషన్ రెడ్డి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ 4.0లో కొన్ని కంపెనీలకు సడలింపులు ఇవ్వగా.. వినోద పరిశ్రమ అయిన సినిమాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. నిన్న టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి సహా సీఎం కేసీఆర్‌తో సమావేశమై... సినిమా నిర్మాణాలను అనుమతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాణం కోసం మూడంచెల అనుమతిని ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారు. జూన్ మొదటి వారం నుంచి కరోనా వైరస్ నియంత్రిత చర్యలు పాటిస్తూ సినిమాలు నిర్మించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సినీ పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లాక్ డౌన్ వల్ల సినీ ఇండస్ట్రీపై పడిందన్నారు కిషన్ రెడ్డి. వీడియో కాన్పరెన్స్‌లో సమస్యల గురించి సురేశ్ బాబు సహా పలువురు చర్చించారు. షూటింగ్స్ కోసం అనుమతి ఇవ్వాలని కూడా కోరగా.. తెలుగు సినిమా కాకుండా దేశవ్యాప్తంగా అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామమని తెలిపారు. కశ్మీర్‌లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఓకేసారి థియేటర్లు తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఓటీటీలో విడుదల చేసే సినిమాలకు కూడా సెన్సార్ ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

 central government will be permit film shooting: kishan reddy

సినిమా పైరసీపై త్వరలో అంతర్జాతీయ మీటింగ్ నిర్వహించి.. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. సినీ ప్రముఖుల ప్రస్తావించిన సమస్యలపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సహా దర్శకుడు తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము, వివేక్ కూచిభొట్ల, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి, అనిల్ తదితరులు కిషన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

English summary
central government will be permit film shooting in counrty wide central minister kishan reddy said to tollywood film makers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X