వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగింపుకు కేంద్రం నుండి రాని సానుకూలత, కొత్త సిఎస్ ఎవరు ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీ కాలాన్ని పొడిగించేందుకు కేంద్రం నుండి సానుకూలంగా స్పందన రాలేదు.దీంతో ఎంజిగోపాల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్రం నుండి అనుమతి రాలేదు. దీంతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. నెలరోజుల పాటు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అయితే అంతకుముందు రాజీవ్ శర్మకు కేంద్రం ఆరుమాసాల పాటు పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాని, ప్రదీప్ చంద్రకు మాత్రం అనుమతి రాలేదు.

నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బాద్యతలను చేపట్టారు.అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మ పదవీకాలం ముగియడంతో ఆయన రిటైర్మెంట్ తీసుకొన్నారు. ఆయన స్థానంలో ప్రదీప్ చంద్రను ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్ళలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మనే ముఖ్యమంత్రి కొనసాగించారు. రాజీవ్ శర్మ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడ ఆరుమాసాల పాటు ఆయనను ప్రధనాకార్యదర్శిగా కొనసాగారు. రెండు దఫాలు ఆయనకు కేంద్రం పదవీకాలం పొడిగించింది. ఈ మేరకు రెండు దఫాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ రెండు దఫాలు కేంద్రం సానుకూలంగానే స్పందించింది.

గత ఏడాది నవంబర్ 30వ, తేదిన రాజీవ్ శర్మ రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో ప్రదీప్ చంద్రను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది.అయితే ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర డిసెంబర్ 31వ, తేదిన రిటైర్ కావాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు మాసాల పాటు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

 కేంద్రం నుండి రాని పొడిగింపు అనుమతి

కేంద్రం నుండి రాని పొడిగింపు అనుమతి


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఈ లేఖను టిఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అందించారు. ఈ లేఖను సిఎం కెసిఆర్ టిఆర్ ఎస్ ఎంపిల ద్వారా పంపారు. ఈ లేఖ గత ఏడాది డిసెంబర్ 27వ, తేదిన ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధానమంత్రి ఈ ఫైల్ పై సంతకం చేస్తే ప్రదీప్ చంద్రకు మరో మూడు మాసాల పాటు పదవీకాలాన్ని పొడిగించేందకు అనుమతి లభించేది.

 ఎదురు చూపులే

ఎదురు చూపులే


ప్రదీప్ చంద్రకు పదవీకాలాన్ని పొడిగింపు విషయమై నాలుగురోజులు ఎదురుచూస్తున్నారు.అయితే కేంద్రం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. గతంలో రాజీవ్ శర్మకు రెండు దఫాలుగా పదవీకాలాన్ని పొడిగించింది కేంద్రం. అయితే ఈ దఫా కూడ అదే తరహలో పొడిగింపు వస్తోందని భావించారు.అయితే ప్రధానమంత్రి కార్యాలయానికి పదవీ కాలం పొడిగింపు విషయమై లేఖ చేరినా కాని స్పందన రాలేదు.దీంతో డిసెంబర్ 31వ,తేది రాత్రి వరకు ఎదురుచూశారు. అయినా ఫలితం లేకపోయింది.ఈ విషయమై డిఓపిటి తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండాపోయింది.

ఏమౌతోంది, ఇలా ఎందుకు జరిగింది ?

ఏమౌతోంది, ఇలా ఎందుకు జరిగింది ?


కేంద్ర ప్రభుత్వం ప్రదీప్ చంద్రకు పదవీకాలాన్ని పొడిగించేందుకు అనుమతి లభించకపోవడం వెనుక ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొందా అనే చర్చ కూడ లేకపోలేదు. రాజీవ్ శర్మ కు పదవీకాలాన్ని పొడిగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రిని స్వయంగా కలిసి పొడిగించారు. అయితే ప్రదీప్ చంద్రకు కూడ పదవీకాలాన్ని పొడిగించాలని కోరినా ప్రభుత్వం నుండి స్పందన లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడ ఈ విషయంలో మనుసు మార్చుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘాలు కొన్ని ప్రదీప్ చంద్రకు పదవీకాలాన్ని పొడిగించేందుకు వ్యతిరేకతను వ్యక్తం చేశారనే ప్రచారం కూడ ఉంది.

 కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు ?

కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు ?


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే చర్చ సాగుతోంది. ప్రదీప్ చంద్రకు పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం ఇంకా రాలేదు.దీంతో కొత్త సిఎస్ ను నియమించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సీనియారిటీ ప్రకారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసుల్లో ఎంజి గోపాల్, రాజీవ్ రంజన్ ఆచార్య ఎస్ పి సింగ్ ల పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఎంజిగోపాల్ వైపుకు ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతాున్నాయి.

English summary
who is next chief secretary of telangana state governament , central governt ment didnot extend the term of the incumbent chief secretary pradeep chandra,. pradeep chandra tenure ended on saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X