
ఒవైసీ భద్రతపై కేంద్రం యుద్ధ ప్రాతిపదిక చర్యలు: ఆయన చుట్టూ కమెండోలు: 26 మందితో
లక్నో: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటన అనంతరం- పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

కారులో వెళ్తోన్న ఒవైసీపై..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా పాల్గొంటున్నారు. మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయన ప్రయాణిస్తోన్న కారుపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది.

టోల్‌ప్లాజా సీసీటీవీ ఫుటేజీల్లో..
నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరపడం స్పష్టంగా ఇందులో కనిపించింది. ఎరుపురంగు హుడీ ధరించిన ఓ యువకుడు తొలుత కాల్పులు జరపడం.. కారు వైపు వేగంగా దూసుకుని రావడంతో అతను కిందపడటం ఇందులో రికార్డయింది.

యుద్ధ ప్రాతిపదికన
ఆ ఇద్దరినీ సచిన్, శుభమ్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. ఇవ్వాళ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కాల్పుల ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. లోక్‌సభ సభ్యుడిగా అసదుద్దీన్ ఒవైసీకి కల్పించిన భధ్రతను పునఃసమీక్షించింది. భద్రతను పెంచింది. వ్యక్తిగ భద్రతను మరింత బలోపేతం చేసింది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాలతో జెడ్ సెక్యూరిటీని కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలుస్తోంది.

జెడ్ సెక్యూరిటీలో..
ఈ
జెడ్
కేటగిరీ
సెక్యూరిటీలో
నలుగురు
నుంచి
ఆరుమంది
నేషనల్
సెక్యూరిటీ
గార్డ్‌కు
చెందిన
కమెండోలను
నియమించనుంది.
వారితో
పాటు-
22
మందితో
ఢిల్లీ
పోలీసులు
లేదా
ఇండో-టిబెటన్
పోలీసు
బలగాలు
లేదా
కేంద్రీయ
రిజర్వ్
పోలీస్
బలగాలను
వినియోగించనుంది
కేంద్ర
ప్రభుత్వం.
ఈ
మేరకు
అమిత్
షా
సారథ్యంలోని
కేంద్ర
హోం
మంత్రిత్వ
శాఖ
కీలక
నిర్ణయాన్ని
తీసుకున్నట్లు
చెబుతున్నారు.
అసదుద్దీన్
ఒవైసీకి
భద్రతను
కల్పించడం
తమ
బాధ్యతగా
అమిత్
షా
వ్యాఖ్యానించినట్లు
తెలుస్తోంది.

ఈసీ దృష్టికి..
ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుందని అంటున్నారు. జెడ్ సెక్యూరిటీ భద్రత మధ్యే ఇక అసదుద్దీన్ ఒవైసీ- ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కాగా- ఇదివరకు హరిద్వార్, ఆ తరువాత ప్రయాగ్రాజ్లల్లో నిర్వహించిన ధర్మసంసద్ మహాసభ ముగిసిన కొద్ది రోజుల్లోపే తనపై కాల్పులు జరిగాయని, ఈ విషయాన్ని తాను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని ఒవైసీ స్పష్టం చేశారు.