వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా స‌త్య‌పాల్ మాలిక్‌..!?న‌ర‌సింహ‌న్‌కు కీల‌క బాధ్య‌త‌లు:బీజేపీ నేత‌ల ఆలోచ‌న ఇలా.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం ఖ‌రారైంది. ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన న‌ర‌సింహ‌న్ ప్ర‌స్తుతం కేవ‌లం తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా మాత్ర‌మే ఉన్నారు. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. దీంతో..తెలంగాణ‌కే ప‌రిమితం అయిన న‌ర‌సింహ‌న్‌ను అక్క‌డి నుండి బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు ప్ర‌స్తుతం జమ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌త్య‌పాల్ మాలిక్‌ను తెలంగాణ‌కు బ‌దిలీ చేస్తేన్న‌ట్లుగా ఢిల్లీ నుండి అందుతున్న స‌మ‌చారం. కాశ్మీర్‌లో మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో అక్క‌డ రా..ఐబి వంటి సంస్థ‌ల్లో ప‌ని చేసిన న‌ర‌సింహ‌న్ సేవ‌లు అక్క‌డ వినియోగించుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక‌టి రెండు రోజుల్లోనే నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా స‌త్య‌పాల్ మాలిక్‌..!

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా స‌త్య‌పాల్ మాలిక్‌..!

ప్ర‌స్తుతం జ‌మ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌త్య‌పాల్ మాలిక్‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించాల‌ని కేంద్రం నిర్ణ యించిన‌ట్లు స‌మాచారం. చ‌త్తీస్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటూ 2009 డిసెంబ‌ర్‌లో ఉమ్మ‌డి ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త లు స్వీక‌రించిన న‌ర‌సింహ‌న్ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కూడా ఏపీ-తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసారు. ఏపీకి కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మించ‌టంతో ఇప్పుడు న‌ర‌సింహ‌న్ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం అయ్యారు. అయితే, దాదాపు ప‌దేళ్ల కాలం పాటు న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఒకే చోట ఉండ‌టంతో ఆయ‌న‌ను బ‌దిలీ చేస్తార‌నే ప్ర‌చారం కొంత కాలంగా సాగుతూనే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌స్తుతం జ‌మ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న స‌త్య‌పాల్ మాలిక్ ను నియ‌మించాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న స‌రిగ్గా ఏడాది క్రిత‌మే జ‌మ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, అక్క‌డ నెల‌కొన్ని తాజా ప‌రిస్థితుల కార‌ణంగా ఆయ‌న్ను తెలంగాణ‌కు బ‌దిలీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌మ్ముకాశ్మీర్‌కు న‌ర‌సింహ‌న్‌...!

జ‌మ్ముకాశ్మీర్‌కు న‌ర‌సింహ‌న్‌...!

ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను జ‌మ్ము కాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్‌గా పంపాల‌ని కేంద్రం నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. జ‌మ్ము కాశ్మీర్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో కేంద్రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ అద న‌పు బ‌ల‌గాలు మొహ‌రించ‌టంతో పాటుగా అమ‌ర్‌నాద్ యాత్ర‌ను సైతం నిలిపివేసారు. జ‌మ్ము కాశ్మీర్ అంశాన్ని జాతీ య భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ థోవ‌ల్ వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ రాష్ట్రప‌తి పాల‌న ఉండ టంతో గ‌వ‌ర్న‌ర్ పైన మ‌రింత బాధ్య‌త పెరిగింది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో రా..కేంద్ర ఇంట‌లిజెన్స్ లో కీల‌క విభాగా ల్లో ప‌ని చేసిన న‌రసింహ‌న్ సేవ‌లు ప్ర‌స్తుత సున్నిత ప‌రిస్థితుల్లో అక్క‌డ వినియోగించుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడ‌గా ఉన్న అజిత్ ధోవ‌ల్‌..న‌ర‌సింహ‌న్ ఓకే బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు. దీంతో ..ఆయ‌న కూడా న‌ర‌సింహ‌న్‌ను కాశ్మీర్‌కు కేటాయించే అంశాన్ని ప్రతిపాదించాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న కేంద్రం న‌ర‌సింహ‌న్‌ను జ‌మ్ము కాశ్మీర్‌కు బ‌దిలీ చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

బీజేపీ నేత‌లు మాత్రం ఇలా..

బీజేపీ నేత‌లు మాత్రం ఇలా..

తెలంగాణ బీజేపీ నేత‌లు మాత్రం పార్టీ నేప‌థ్యం ఉన్న వారికి ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్‌గా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీకి రాజ‌కీయంగా సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంద‌ని..ఇటువంటి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు చెక్ పెట్టేలా ఇక్క‌డ వ్యూహాలు అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేత‌ల విజ్ఞ‌ప్తితో ఇప్పుడు బీజేపీ కేంద్ర నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు చెబుతున్నారు. న‌ర‌సింహ‌న్ సైతం కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌ఖ్య‌త‌గా ఉన్నా.. కొద్ది రోజులుగా మాత్రం ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ప‌ట్ల లోతుగా అధ్య‌య నం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు కేంద్రం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ నియ‌మాకం విష‌యంలో తుది నిర్ణ‌యం ఏర‌కంగా తీసుకుంటుందో ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

English summary
Central Govt thinking about nominate new Governor for Telangana. Present Governor Narasimhan may transferred to Jammu and Kashmir. As per sources info Satya paul malik may be the new governor for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X