వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌తో మాట్లాడతా... నితిన్ గడ్కరీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను మాట్లాడతానని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సమ్మెపై అధికారులు సంబంధిత మంత్రితో చర్చిస్తానని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, మంత్రి కిషన్‌రెడ్డిలు నితిన్ గడ్కరీని కలిసి విజ్ఝప్తి చేశారు. ప్రస్తుత పరిణామాలపై మంత్రికి వివరించారు. దీంతో మంత్రి పై విధంగా స్పందిచారు.

మంత్రి కిషన్ రెడ్డి విజ్ఝప్తి

మంత్రి కిషన్ రెడ్డి విజ్ఝప్తి

కాగా ఆర్టీసీ సమస్యపై జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈనేపథ్యంలోనే కార్మికులకు న్యాయం చేసేందుకు మంత్రి చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఎలాంటీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికులపై కక్ష సాధింపు ధోరణి వదిలి సానుకూలంగా స్పందించాని ముఖ్యమంత్రికి విజ్ఝప్తి చేశారు.

అశ్వత్థామ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకూడదు

అశ్వత్థామ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకూడదు

మరోవైపు ఇదే అంశంపై ఎంపీలు సోయంబాపురావు, బండిసంజయ్, అర్వింద్‌లు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా బంగారు తెలంగాణ సాధనలో కార్మికులు భాగస్యామ్యం కూడ ఉంటుంది కాబట్టి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. దీంతో పాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలని విజ్ఝప్తి చేశారు. కాగా సమ్మెను విరమిస్తున్నామని అశ్వత్థామ రెడ్డి ప్రకటన ప్రకటన చేయడంపై ఎంపీ అర్వీంద్ స్పందించారు. అందరి కార్మికుల అభిప్రాయాలను పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని జేఏసీ నేతలకు సూచించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే అంశాన్ని కార్మికులు చెబుతున్నట్టుగా ఆయన తెలిపారు.

భవితవ్యంపై సీఎం సమీక్ష

భవితవ్యంపై సీఎం సమీక్ష

ఇక ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో అధికారులలో పాటు సంబంధిత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇతర ముఖ్యనేతలు పాల్గోనే అవకాశాలు ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటీ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అధికారులు కూడ న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించారు. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం ద్వార జరిగే పరిణామాలపై చర్చించేందుకు ఆయా విభాగాల అధికారులతో ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ భేటి అయ్యారు.

English summary
Union Transport Minister Nitin Gadkari responds on RTC strike.that he said would speak to Chief Minister KCR on the ongoing RTC strike in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X