హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాటిని చూడండి, హైకోర్టు తర్వాతే ఏదైనా: కేంద్రానికి కేసీఆర్ చురక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైకోర్టు డివిజన్ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా కేంద్రాన్ని హెచ్చరించారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. అనంతరం, కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంగళవారం నాడు లేఖ రాశారు.

కేజ్రీవాల్‌లా మారతానంటే నీ ఇష్టం: కేసీఆర్‌పై కేంద్రం సీరియస్, బాబుని లాగారుకేజ్రీవాల్‌లా మారతానంటే నీ ఇష్టం: కేసీఆర్‌పై కేంద్రం సీరియస్, బాబుని లాగారు

ఉమ్మడి హైకోర్టును విభజించిన తర్వాతనే న్యాయాధికారులు, సిబ్బంది కేటాయింపులు జరపాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన పూర్తికాని పక్షంలో రాష్ట్ర విభజన అసంపూర్తిగానే ఉంటుందన్నారు.

కార్యనిర్వాహకవర్గాన్ని, చట్టసభలను విభజించిన పద్ధతిలోనే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు వర్తించేవిధంగా విభజించి తీరాలని, వేర్వేరు రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాతనే న్యాయాధికారుల నియామకాలకు చర్యలు చేపట్టాలన్నారు.

KCR

న్యాయాధికారుల నియామకంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నింటినీ ఉదహరిస్తూ లేఖ రాశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, సెక్షన్-31 ప్రకారం ఎప్పుడో జరగాల్సిన ఉమ్మడి హైకోర్టు విభజన నేటికీ పెండింగ్‌లోనే ఉన్నదని పేర్కొన్నారు. ఈ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు.

11 మంది సస్పెన్షన్: వంద మంది టీ జడ్జీలు మూకుమ్మడి సెలవులు11 మంది సస్పెన్షన్: వంద మంది టీ జడ్జీలు మూకుమ్మడి సెలవులు

'ఉమ్మడి హైకోర్టు గత నెల 3న న్యాయాధికారుల కేటాయింపుల తాత్కాలిక జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణకు 95, ఏపీకి 110 మంది న్యాయాధికారులను కేటాయించారు.' తెలంగాణకు నియమించిన 95 మందిలో ఏపీకి చెందిన వారు 58 మంది ఉన్నారు.

ఏపీలో 29 ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా అక్కడి వారిని తెలంగాణకు కేటాయించారు. సీనియర్, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు సహా అన్ని కేడర్లలో కలిపి మొత్తంగా ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించారు. న్యాయాధికారుల కేటాయింపులో రాజ్యాంగంలోని నిబంధనలు వర్తిస్తాయి.

ఈ కేటాయింపులు తెలంగాణలోని న్యాయాధికారులు, న్యాయవాదుల్లో అసంతృప్తిని కలిగించాయి. న్యాయాధికారులు హైకోర్టు నియంత్రణలో గల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ విభజన చట్టంలోని 77 ప్రకారం వారి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాలి. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ల ఏర్పాటు సమయంలో ఆయా రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటైన తర్వాతే కేటాయింపులు జరిగాయ'ని పేర్కొన్నారు.

'అమరావతి' పేరుతో కుట్ర: కవిత, తెరపైకి 'విభజన'.. రేవంత్‌కు రివర్స్'అమరావతి' పేరుతో కుట్ర: కవిత, తెరపైకి 'విభజన'.. రేవంత్‌కు రివర్స్

మొత్తం అన్నింటిని పరిగణనలోనికి తీసుకొని కేంద్ర ప్రభుత్వమే న్యాయాధికారుల కేటాయింపులు జరపాలని, గతంలో రాష్ట్రాల విభజన చట్టాల్లో పాటించిన నిబంధనలనే ఇప్పుడు అమలు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

రాష్ట్ర విభజన చట్టంలోని 31వ సెక్షన్‌ ప్రకారం ఉమ్మడి హైకోర్టును విభజించాల్సి ఉన్నా ఇంకా అది జరగలేదని, ఇందుకోసం కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ కోరారు. ఇదే లేఖను మరో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌కు కూడా పంపించారు.

English summary
The bifurcation of judicial officers should be done by the Central government and as per the provisions of the AP Reorganisation Act, 2014, chief minister K Chandrasekhar Rao demanded Union Home Minister Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X